Watching TV: వాయమ్మో.. ఎక్కువ సేపు టీవీ చూస్తే ఇంత ప్రమాదమా..

First Published Jan 22, 2022, 2:45 PM IST

Watching TV: గంటల తరబడి టీవీ చూసినా అలసిపోని వారు చాలా మందే ఉన్నారు. కానీ టీవీ చూస్తుంటే వచ్చే మజా కన్నా.. దాన్ని ఎక్కువగా చూడటం వల్ల వచ్చే ప్రమాదమే ఎక్కువని మీకు తెలుసా.. టీవీని గంటల తరబడి చూడటం వల్ల జరిగే అనర్థాల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే... 
 

Watching TV: రోజంతా టీవీ ల ముందు తిష్ట వేసే వారు నేడు చాలా మందే ఉన్నారు. రోజంతా కొందరు ఫోన్లలో తలదూరిస్తే.. మరికొందరు టీవీల ముందు వాలిపోతుంటారు. అతిగా ఏది చేసినా ప్రమాదమే అని మనందరికీ తెలిసిందే. అలాగే ఎక్కువ సేపు టీవీ ని చూడటం కూడా అత్యంత ప్రమాదమని యూకే శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నాలుగు గంటలకంటే ఎక్కువ సమయం టీవీ చూస్తే శరీరంలో రక్తం గడ్టకడుతుందని తేల్చి చెప్పారు. దీని వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 

రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు టీవీ చూస్తే 35 శాతం శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం పొంచి ఉందని తాజాగా బ్రిస్టల్ విశ్వవిధ్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెళ్లడైంది. ఈ పరిశోధనకు Venous thromboembolism సమస్య లేని 40 ఏండ్లు, అంతకంటే ఎక్కవు వయసున్న 31,421 మందిని ఎంచుకున్నారు. ఈ పరిశోధనలో వాళ్లను రోజులో నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు టీవీని  చూడమన్నారు. ఆ తర్వాత Venous thromboembolism సమస్యకు, టీవీ చూస్తున్నంత సేపు కలిగిన మార్పులకు మధ్య సంబంధాన్ని పరిశీలించారు. 

దీని ద్వారా మెదడులో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల్లోల రక్తం గడ్డకట్టడం వంటి విషయాలపై పరిశోధనలు చేశారు. కాగా 4 గంటలకంటే ఎక్కువ సేపు టీవీ చూసే వారే ఎక్కువగా Venous thromboembolism సమస్యకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. అంతేకాదు కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకడుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అదికాస్త ఊపిరితిత్తుల వరకు చేరుకుని మనల్ని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు తేల్చి చెప్పారు. 
 

ఎక్కువ సేపు టీవీ చూసిన వారిలో కంటే, చూడని వారిలో చాలా అరుదుగా Venous thromboembolism సమస్య భారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు వెళ్లడిస్తున్నారు. 4 గంటలకంటే ఎక్కువ సేపు టీవీ చూసే వారికే 1.35 రెట్లు ఈ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తెలుపుతున్నారు. 
 

అందుకే ఎక్కువ సేపు టీవీ చూసే అలవాటును మానుకోవడం మంచిది. టీవీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒక అర్థగంట పాటు బ్రేక్ తీసుకుని నడవాలి. అలాగే టీవీ చూస్తున్నప్పుడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోకపోవడం ఉత్తమం. అసలుకి టీవీ చూస్తున్నప్పుడు ఫుడ్ తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే టీవీ చూస్తున్నప్పుడు ఎంత తింటున్నామో తెలియదు. ఎక్కువగా తినే ప్రమాదం ఉంది. దీని వల్ల బరువు పెరిగి ప్రమాదం ఉంది.  
 

click me!