బాత్రూంలో కూడా ఫోన్లను వాడుతున్నారా? కన్ఫామ్ మీకు ఆ రోగాలు వచ్చుంటయ్..

First Published Jan 29, 2022, 12:02 PM IST

Phone use in the bathroom: ఫోన్ల వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. కానీ మితిమిరిన ఫోన్ల వాడకం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. దీనికి తోడు ఫోన్లను బాత్రూంలో  కూడా వాడకుండా ఉండలేకపోతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉం

Phone use in the bathroom: ఒకప్పుడు ఊరికి ఒకటో లేదా రెండో ఫోన్లు ఉండేవి. రానురాను ఇంటికో ఫోన్ వచ్చింది. అదికాస్త ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్లు వచ్చాయి. మరి అంతలా డెవలప్ అయ్యింది ఈ సమాజం. ఫోన్ల వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో దీని వాడకం మితిమీరితే అంతకంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందులోనూ ఈ స్మార్ట్ ఫోన్లకు చాలా మంది బానిసలుగా మారారు. వారు ఒక క్షణం ఫోన్ లేకుండా ఉండలేరు. అది లేకుంటే ఏదో కోల్పోయా నేను అనే ఆలోచనలోనే ఉంటారు. అందుకే ఎక్కడికి వెళ్లినా.. దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అంతెందుకు బాత్రూంకు  లేదా టాయిలెట్ కు వెళ్లినప్పుడు కూడా దాన్ని తమ వెంటనే తీసుకెళ్తుంటారు. కానీ ఫోన్లను బాత్రూం కి లేదా టాయిలెట్ కు తీసుకెళ్లడం వల్ల ఎన్నో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా సెల్ ఫోన్లు తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి బాత్రూంలో స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం వల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఒక అధ్యయనం ప్రకారం.. టాయిలెట్ సీట్ కంటే స్మార్ట్ ఫోన్లే చాలా Dirty గా ఉంటాయట. ఇది ఎవరూ నమ్మలేని నిజం. అయితే ఈ స్మార్ట్ ఫోన్లలో ప్రేగు వ్యాధికి దారితీసే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారాన్ని విషంగా కూడా మారుస్తుంది. ఇటువంటి బ్యాక్టీరియా టాయిలెట్ లో కూడా ఉంటుంది. అంతేకాదు ఇతర అపరిశుభ్రమైన ప్లేసెస్ లో కూడా ఈ బ్యాక్టీరియా జీవిస్తుంది. ఇకపోతే టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఫోన్ తీసుకెళ్తే ఆ బ్యాక్టీరియా మన ఫోన్ కు అంటుకుంటుంది. తద్వారా మనకు అనేక రోగాలు సోకుతాయి. 
 

బాత్రూంలో ఎక్కువ సేపు ఉంటే కూడా పైల్స్ సమస్య వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ పై ఎక్కువ సేపు కూర్చుంటే హేమోరాయిడ్ల ప్రమాదం పెరుగుతుందట. అయితే స్మార్ట్ ఫోన్లు ప్రవేశించినప్పటి నుంచే ఈ సమస్య మరింత పెరిగిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీరు టాయిలెట్ సీట్ పై కూర్చొని ఫోన్లను చూస్తే మీకు సౌకర్యంగా అనిపించినప్పటికీ.. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కొన్ని అధ్యయనాల ప్రకారం.. సెల్ ఫోన్ల వాడకం మన ఆలోచనా విధానాల్ని దెబ్బతీస్తుందట. అంతేకాదు సెల్ ఫోన్లు అతిగా వాడితే మన ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. అంతేకాదు మన ఆలోచనా సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు గానీ, ఏదైనా పనిచేస్తున్నపుుడు గానీ ఫోన్లు ఉపయోగించొద్దు. అందులోనూ బాత్రూంలో ఉన్నప్పుడు మన గురించి మనం ఆలోచించడానికి కాస్త సమయం దొరుకుతుంది. అటువంటి ఫ్రీ టైం ను ఉపయోగించుకోకుండా.. ఫోన్లతో గడపడం వల్ల ఎటువంటి లాభాలు లేవు. నష్టాలు తప్ప. 
 

బాత్రూంలో ఎక్కువ సేపు సమయాన్ని గడిపితే మూత్రాశయం, ప్రేగులు, యోని అవయవాలకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అంటే ఆ అవయవాల కటి నేల కండరాలకు బలం లేకుండా తయారవుతాయి. దీనికి కారణం టాయిలెట్ సీట్ లో మనం కూర్చునే విధానమే ప్రధాన కారణం. 

click me!