Weight Loss Tips : ఈ మూడు ఆరోగ్య సూత్రాలు చాలు మీరు ఈజీగా బరువు తగ్గడానికి..

First Published Jan 21, 2022, 3:42 PM IST


Weight Loss Tips : అది చేస్తే తగ్గుతారు.. ఇది చేస్తే తగ్గుతారు అంటూ నానా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయినా తమ బరువును కిలో కూడా తగ్గించలేని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు మూడే మూడు పనులు చేస్తే చాలు ఈజీగా తమ బరువును తగ్గొచ్చు.. అవేంటంటే

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో ఊబకాయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అందుకు కారణాలు అనేకం. అయితే అయ్యో లావయ్యానే అని నిరాశకు గురికాకుండా ఏం చేస్తే ఈ బరువును తగ్గుతామని ఆలోచించాలి. ఆ మార్గాలను క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మీరు అధిక బరువును కోల్పోయి నాజుగ్గా తయారవుతారు. అందుకు ముందుగా మీరు చేయాల్సింది.. అవసరమైన ఆహారాన్నే తీసుకునేటట్టుగా ప్రణాళికను సిద్దం చేసుకోవాలి. అలాగే మీ జీవనశైలిని మార్చుకోవాలి. అయితే ఇప్పటి మందమే బరువును తగ్గడం పై కాకుండా జీవితకాలం మొత్తం మీ బరువును నియంత్రించుకునే విధంగా ఉండాలి. ఎలాంటి సమస్యను తగ్గించాలన్నా అది పూర్తిగా మనచేతిలో పనే. అందుకే మన ఆరోగ్యం బాగుండాలన్నా, అధిక బరువును తగ్గించుకోవాలన్నా ఈ మూడు ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుందాం పదండి. 

 మనం తీసుకునే ఆహార పదార్థాలే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. అందుకే సరైన ఆహారం నియమం చాలా అవసరం. ఈ నియమాన్ని ఎంత శ్రద్ధగా పాటిస్తే మన ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. ఈ ఆహార నియమాన్ని మీ జీవన శైలిగా మార్చుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే  ఆహారంలో ప్రోటీన్లు, మైక్రో, మ్యాక్రో, న్యూట్రియెంట్లతో కూడిన పోషకవిలువలు అధికంగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. ఇలాంటి ఆహారాన్ని మీరు గనుక అలవాటు చేసుకుంటే అధిక కొవ్వును కరిగించే పనిని మొదలు పెట్టినట్టే అవుతుంది. అలాగే సరైన డైట్ ను ప్లాన్ చేసుకుని క్రమం తప్పకుండా పాటించేలా చూసుకోవాలి. మెరుగైన ఆరోగ్యానిచ్చే ఫుడ్ నే తినాలి. ఏ ఒక్క రోజు కూడా ఈ రూల్ ను అస్సలు తప్పకూడదు. మసాలాలకు దూరంగా ఉండండి. 

శరీరంలో బలంగా, ఫిట్ గా ఉండాలంటే వర్కౌట్లు ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ వర్కౌట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని ఒకే సారి భారీ భారీ వర్కౌట్లను చేయడం ప్రమాదం. అలా మీరు చేయలేరు కూడా. అందుకని మొదటగా చిన్న చిన్న వర్కౌట్లనే చేయండి. మెల్లి మెల్లిగా మీకే అలవాటు అవుతుంది. అందులోనూ మీకు సూటయ్యే వర్కౌట్లనే ఎంచుకోవడం చాలా బెటర్. కానీ వ్యాయామాలను ఒక సారి అలవాటు చేసుకున్నాకా క్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ మీకు జిమ్ లకు వెళ్లడం ఇష్టం లేకుంటే రన్నింగ్, జాగింగ్ లేదా సైక్లింగ్ చేయవచ్చు. మీరు ఎలాంటి వ్యాయామం చేసినా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోండి. ఈ వ్యాయామం కేవలం అధిక క్యాలరీలను కరిగించడమనే భావనే కాకుండా మీ శరీరాన్ని పాజిటివ్ స్ట్రెస్ కు కూడా అలవాటు చేస్తుందని గుర్తించండి.
 

सुबह जल्दी उठने की आदत डालें

. అలసిన శరీరం తిరిగి శక్తిని పుంజుకోవాలన్నా, ఉత్తేజంగా తయారవ్వాలన్నాకంటి నిండా నిద్ర ఎంతో అవసరం. శరీరానికి సరిపడా నిద్ర ఉంటే ఎటువంటి రోగాన్నైనా ఇట్టే తరిమేయొచ్చు. కానీ ప్రస్తుత కాలంలో నిద్రకిచ్చే సమయం చాలా తక్కువ. దాని కారణంగానే అనేక రోగాలు మనల్ని అటాక్ చేస్తున్నాయి. అనారోగ్యం నుంచి తొందరగా రికవరీ కావాలంటే ముందుగా కావాల్సింది సరిపడా నిద్రనే. ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడైనా నిద్రతో మటుమాయం అవుతుంది. కాబట్టి నిద్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. 


4. నీటితో సకల రోగాలను నయం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు బల్ల గుద్ది చెప్తారు. ఎందుకో తెలుసా.. శరీరానికి సరిపడా నీరు లేకపోతేనే బాడీ అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంది. ముఖ్యంగా మనం తీసుకున్న పోషకాలు శరీరమంతా విస్తరించడానికి నీరే చాలా ముఖ్యం. అందుకే శరీరానికి నీటి కొరత రాకుండా జాగ్రత్త పడాలి. అందులోనూ శరీరంలో కలుషితాలు, నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు శరీరంలో సరిపడా నీల్లు ఉండాలి. దాహం వేస్తేనే తాగుతా అనకుండా దాహం వేయకున్నా నీళ్లను తరచుగా తాగుతూ ఉండాలి. దీని వల్ల అదనపు క్యాలరీలు ప్రవేశించే అవకాశం ఉండదు. 
 

click me!