సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Jan 27, 2023, 12:10 PM IST

హైపర్ సెక్సువాలిటీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. నిజానికి సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. 

సెక్స్ ఆరోగ్యానికి మంచే చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే కానీ.. ఎప్పుడూ దీని గురించి ఆలోచించడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. సెక్స్ గురించి ఎప్పుడూ ఆలోచించడాన్నే హైపర్ సెక్సువల్ అంటారు. ప్రారంభంలో ఇది ఎలాంటి హాని చేయకపోయినా.. ఫ్యూచర్ లో ఎన్నో సమస్యలను తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల  మీ ఆరోగ్యమే కాదు మీ జీవితం కూడా ప్రభావితం అవుతుందట. మీరు హైపర్ సెక్సువలా?  కాదా? అని మీకు ఇప్పటికీ మీకు తెలియకపోతే, హైపర్సెక్సువాలిటీ కొన్ని సంకేతాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. హైపర సెక్సువాలిటీ గురించి, సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్.. ఐదవ ఎడిషన్ (డిఎస్ఎమ్ -5) ద్వారా హైపర్సెక్సువాలిటీ అనేది రుగ్మత లేదా రోగ నిర్ధారణగా గుర్తించబడలేదు. కానీ ఇది లైంగిక కోరికలు, ఫాంటసీలు, ప్రవర్తనలు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయని జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అడిక్షన్స్ తెలిపింది. ఈ హైపర్ సెక్సువాలిటీ ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. 
 

హైపర్సెక్సువాలిటీ అంటే ఏమిటి?

మీరు సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదా మీ లైంగిక కోరికలను నియంత్రించలేకపోవడాన్నే హైపర్సెక్సువాలిటీ అంటారు.  హైపర్ సెక్సువాలిటీ ఆందోళన కలిగించే విషయం తెలుసా? ఎందుకంటే ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

హైపర్ సెక్సువాలిటీ ఎందుకు మంచిది కాదు 

హైపర్ సెక్సువాలిటీ వల్ల పని లేదా ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టలేరు.
ఇది ఒత్తిడిని కలిగిస్తుంది.
ఆందోళనకు దారితీయొచ్చు
నిరాశను కలిగించొచ్చు.
మీ రిలేషన్ షిప్ అంత బాగుండదు.
మీరు ఎప్పుడూ చిరాకు పడుతుంటారు. 

porn

హైపర్ సెక్సువాలిటీ సంకేతాలు

హైపర్ సెక్సువాలిటీ విషయానికి వస్తే.. అశ్లీల కంటెంట్ ను ఎక్కువగా చూడటం. లేదా హస్త ప్రయోగం ఎక్కువగా చేయడం. 
 

మీరు హైపర్సెక్సువాలిటీతో పోరాడుతున్నారని సూచించే మరికొన్ని సంకేతాలు

లైంగిక ఫాంటసీలు ఎక్కువగా ఉండటంతో పాటుగా అలాంటి ప్రవర్తన, కోరికలను కలిగి ఉంటారు. వీటికోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇవి మీ నియంత్రణలో లేనట్టుగా భావిస్తారు.

ఇలాంటి లైంగిక కోరికలను, ప్రవర్తణను తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రయత్నించడం. కానీ దానిలో విఫలమవుతారు. 

అంతేకాదు మీరు ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతారు. ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఫీలయ్యి వాటి నుంచి  తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నటైతే మీరు హైపర్సెక్సువాలిటీ బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి. 

ఒకవేళ మీరు రిలేషన్ షిప్ లో ఉంటే మీ బంధం  అంతంత మాత్రమే ఉంటుంది. వారికి ఎక్కువ సమయం కేటాయించరు.

మీరు సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఈ ప్రవర్తన గురించి.. టెన్షన్, విసుగు, ఒంటరితనం, సిగ్గు, బాధగా అనిపిస్తే మాత్రం వెంటనే మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.  ఏదేమైనా మీరు ఒంటరిగా లేరని తెలుసుకోవాలి. మీ ప్రవర్తనను మార్చుకోవడానికి ఇతర సహాయం కూడా తీసుకోవచ్చు. 

click me!