డబ్బున్న వారికి ఈ సమస్యలు తప్పవు..!

First Published Jun 29, 2022, 11:28 AM IST

మన జీవితం మాత్రం డబ్బులేక ఇలా ఉండిపోయిందే అని బాధపడుతూ ఉంటారు. కానీ... నిజానికి డబ్బు ఉన్నవారికి కూడా సమస్యలు తప్పవట. డబ్బు ఉన్నవారు కామన్ గా ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఓసారి చూద్దాం...

డబ్బు లేని వారికి సమస్యలు రావడం చాలా కామన్. డబ్బున్నవారిని చూసి... వారి లైఫ్ ఎంత బాగుంటుందో.. మన జీవితం మాత్రం డబ్బులేక ఇలా ఉండిపోయిందే అని బాధపడుతూ ఉంటారు. కానీ... నిజానికి డబ్బు ఉన్నవారికి కూడా సమస్యలు తప్పవట. డబ్బు ఉన్నవారు కామన్ గా ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఓసారి చూద్దాం...
 

Money

డబ్బు ఒత్తిడి మీ మనసుకు విశ్రాంతినివ్వదు

డబ్బు ఉన్నవారికి ఒత్తిడి, మనసుకు విశ్రాంతి ఎప్పుడూ ఉండటదట. వారి ఆర్థిక స్థితిని కాపాడుుకోవడానికి వారు చాలా  ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆ డబ్బును ఎలా కాపాడుకోవాలి..? లేదంటే.. ఎటు వైపు నుంచి ఏ వ్యాపారంలో ఎలాంటి నష్టం వస్తుంది..? డబ్బును మరింత పెంచడం ఎలా..? అని ఆలోచిస్తూ ఉంటారట. ఇక.. డబ్బు సంపాదనలో పడి.. కుటుంబాన్ని పట్టించుకుంటున్నామా లేదా..? తాము ధనవంతులమని తెలిసేలా.. ఇంట్లో వస్తువులను అమర్చడం లాంటి చాలా లేనిపోని ఒత్తిడిలు తెచ్చుకుంటారట. పేదవారు డబ్బు కోసం పోరాటం చేస్తుంటే.. ధనవంతుల పోరాటం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. 

ప్రైవసీ ఉండదు..
డబ్బు సంపాదించి.. మిలీనియర్లు గా మారిన తర్వాత.. వారు ఏదో ఒక విధంగా ప్రసిద్ధి చెందుతారు. ఒక్కసారి పాపులారిటీ పొందిన తర్వాత... వారికి ప్రైవసీ అనేది ఉండదు.  ఎక్కడకు వెళ్లినా ఫోటోలు తీస్తారు. చిన్న తప్పు చేసినా పెద్దదిగా చేసి చూపిస్తారు. ఈ క్రమంలో.. మిలియనర్లు తమ జీవితాన్ని గుట్టుగా కాపాడుకోలేరు. ప్రశాంతంగా ఎక్కడికీ బయటకు వెళ్లలేరు. ప్రైవసీ అనేది ఉండదు. వారికి ఈ విషయం ఇబ్బంది పెడుతుంది.
 

భద్రత ప్రధాన ఆందోళనగా మారుతుంది..

మిలియనీర్లు.. తమతో పాటు తమ కుటుంబ భద్రత పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎటు నుంచి అపాయం వస్తుందా అని భయపడుతూ ఉంటారు.  వారికి భద్రత అవసరం, వారి పిల్లలకు పర్యవేక్షణ అవసరం, వాటిని చూడకుండా ఉండకూడదు. దీని గురించి మిలియనీర్లు అన్ని సమయాలలో అసౌకర్యానికి గురవుతారు.

రహస్యాలు..

డబ్బు ఉన్న వ్యక్తులు తరచుగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వారు తమ సంపద గురించి చాలా మందికి తెలియజేయలేరు. వారి చిరునామాను పంచుకోవడం కూడా ఒక సమస్య. చాలా మంది మిలియనీర్లు తమ సెలవులు , వారి షాపింగ్ గురించి కూడా నిశ్శబ్దంగా ఉండవలసి ఉంటుంది.

విమర్శలు

మీరు ప్రసిద్ధి చెంది, మీ గోప్యతను కోల్పోయినప్పుడు, మీరు అవాంఛిత విమర్శలకు గురవుతారు. మిమ్మల్ని అందరూ విమర్శిస్తారు. మీరు చేసింది..తప్పా.. ఒప్పా.. అని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిర్ణయిస్తారు.మీ గురించి అర్థం లేని ఆరోపణలు చేస్తారు. మిమ్మల్ని అందరూ జడ్జ్ చేస్తారు. ఈ క్రమంలో... అందరూ చేసే విమర్శలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
 

click me!