Guava Side Effects: జామపండ్లను ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..? `

First Published Jan 13, 2022, 12:48 PM IST

Guava Side Effects: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రోగాల నుంచి తప్పించుకోవాలన్నా.. రోగ నిరోధక శక్తిని పెంపొందించాలన్నా.. పండ్లకు మించిన దివ్య ఔషదం మరోటి లేదు. అందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభించే జామపండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే డాక్టర్లు సైతం జామపండ్లను ఎక్కువగా తినమని సలహానిస్తారు. అయితే జామ పండ్లను ఈ వ్యాధులున్న వారు అస్సలు తినకూడదని వైధ్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Guava Side Effects: పండ్లలో రారాజైన జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఏ, ఈ, ఖనిజాలు, కాల్షియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా చేసేందుకు దోహదపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో జామ పండ్లకు మించిన పండు మరొకటి లేదు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి అనేక రోగాలకు నివారణగా జామపండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. 

జామపండ్లకు బదులుగా జామకాయలు తింటే జలుబు తొందరగా తగ్గుతుందని వైధ్యులు చెబుతున్నారు.  జామకాయలు తింటే శ్లేష్మం సమస్య తొందరగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక జామ కాయలు, పండ్లే కాదు జామ ఆకులు కూడా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. దగ్గును, ఇతర రకాల వ్యాధుల నివారణకు ఆయుర్వేదంలో ఈ జామ ఆకును ఉపయోగిస్తారు.  ఇన్ని ప్రయోజనాలున్న ఈ పండును తినడం వల్ల కలిగే Benefits ఏంటో తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలో జామపండు బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షించడంలో ముందుంటాయి. క్యాన్సర్ కణాలైన క్వెర్సెటిన్, పాలీఫెనాల్స్, లైకోపీన్ కణాల పెరుగుదలను ఆపేస్తాయి. అలాగే జామ ఆకులు కూడా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు.  

weight loss: అధిక బరువుతో బాధపడేవారికి జామపండును తినాలనేది ఒక చక్కటి చిట్కా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సో ఈ పండును తినడం వల్ల ఎక్కువగా ఆకలి అనిపించదు. అందువల్ల మీకు తరచుగా తినలేరు.  దీని ద్వారా మీరు ఈజీగా బరువును కోల్పోవచ్చు. 

 ప్రస్తుతం చాలా మందిలో అధికంగా కనిపిస్తున్న Problem తిన్నది అరగకపోవడం. ఈ సమస్య వల్ల చాలా మంది తమకు నచ్చిన ఫుడ్ ను తినలేకపోతున్నారు. ఈ జీర్ణసమస్యతో బాధపడేవారికి జామపండు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ పండును రాత్రుళ్లు అస్సలు తినకూడదు.

జామపండును ఈ రోగాలున్న వారు అస్సలు తినకూడదని కొందరు అపోహపడుతుంటారు. ముఖ్యంగా Diabetic పేషెంట్లు తినకూడదని చెబుతుంటారు. ఎందుకంటే ఈ పేషెంట్లు స్వీట్లను అధికంగా తినకూడదని. కానీ మధుమేహ వ్యాధి గ్రస్తులు జామపండ్లను తినవచ్చు. కాకపోతే వీళ్లు రోజుకు ఒక్క పండు మాత్రమే తినాలని డాక్టర్లు సలహానిస్తున్నారు. ఈ జామపండు మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాల్లో కూడా వెళ్లడైంది. అయితే వీరు మోతాదుకు మించి తింటే తంటాలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

జామపండులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యవంతంగా చేయడంలో ముందుంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు Cholesterol ను తగ్గిస్తుంది. అలాగే అవసరమైన మంచి Cholesterolను పెంచడంలో జామపండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ జామపండును తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. గుండెను పదిలంగా చేయడంలో ముందుంటుంది.

click me!