మనం ఒకసారి వేసుకున్న తర్వాత ఏ డ్రెస్ అయినా ఉతుకుతాం. ఉతికిన తర్వాత.. ఆ డ్రెస్ నలిగిపోయినట్లుగా అవుతుంది. అదే డ్రెస్ ని ఒక్కసారి ఐరన్ చేస్తే... మళ్లీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఆ డ్రెస్ కూడా ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంటుంది. కాటన్ లాంటి దుస్తులు అయితే.. గంజి పెట్టి మరీ ఐరన్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
అయితే.. చాలా మంది ఐరన్ చేస్తే నీట్ గా ఉంటాయి కదా అని అన్నిడ్రెస్ లు చేస్తూ ఉంటారు. వాటిలో కొందరు జీన్స్ కూడా ఐరన్ చేస్తూ ఉంటారు. అసలు జీన్స్ కి ఐరన్ అవసరమా..? ఐరన్ చేయడం వల్ల జీన్స్ నీట్ గా ఉంటాయా లేక.. తొందరగా పాడైపోతాయా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
blue jeans
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ జీన్స్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీన్స్ వారికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఆడ పిల్లలు, మగ పిల్లల వరకు అందరూ జీన్స్ ధరిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కాలేజీకి వెళ్లేవారు అయితే.. రోజూ జీన్స్ ధరించడాన్ని ఇష్టపడతారు. ఈ జీన్స్ ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉండాలని.. ఐరన్ చేస్తూ ఉంటారు. అయితే అది చాలా పొరపాటు అని నిపుణులు అంటున్నారు.
జీన్స్ ఉతికిన తర్వాత ఇస్త్రీ చేస్తే జీన్స్ ఆయుష్షు తగ్గిపోతుందట. పొరపాటున కూడా జీన్స్ ని ఐరన్ చేయకూడదట. మనం జీన్స్ కొన్నప్పుడు లోపల ఒక చిన్న నోట్ కూడా ప్యాంట్ కి ఎటాచ్ చేసి ఉంటుంది. దానిని ఎలా ఉతకాలి అనే విషయం అందులో ఉంటుంది. దాంట్లో క్లియర్ గా రాసి ఉంటుంది. ఐరన్ చేయకూడదు అని. మనం మాత్రం ఆ తప్పు రిపీట్ గా చేస్తూనే ఉంటాం.
skinny jeans
అలాగే జీన్స్‌ను రెగ్యులర్‌గా ఉతకడం వల్ల వాటి మెరుపు తగ్గుతుంది. చాలా త్వరగా చినిగిపోతుంది కూడా.. కనీసం 5 లేదా 6 లేదా అంతకంటే ఎక్కువ ధరించిన తర్వాత మీరు జీన్స్ ఉతకాల్సి ఉంటుంది. మీ జీన్స్ మురికిగా అనిపిస్తే, ఫాబ్రిక్ స్ప్రేని ఉపయోగించండి. కానీ వాటిని ఉతకడం మాత్రం చేయకూడదు.
అంతేకాదు... కొందరికి దుస్తులు వేడి నీటితో ఉతికే అలవాటు ఉంటుంది. జీన్స్ ని కూడా అలా ఉతికేవారు ఉంటారు. కానీ... ఆ పొరపాటు కూడా చేయకూడదు. నార్మల్ వాటర్ లో మాత్రమే ఉతకాలి. అప్పుడు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.