ఈ ఆహారాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతయ్.. జర జాగ్రత్త..

First Published Jan 9, 2023, 1:54 PM IST

జన్యుపరమైన కారకాలు, వయస్సు, ఊబకాయం, జీవనశైలి వంటివన్నీ రొమ్ము క్యాన్సర్ కు దారితీస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్ ను ఎక్కువగా సేవించడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. 
 

breast cancer

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక వ్యక్తి రొమ్ము క్యాన్సర్ తో మరణిస్తున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. జన్యుపరమైన కారకాలు, వయస్సు, ఊబకాయం, జీవనశైలి వంటివన్నీ రొమ్ము క్యాన్సర్ కు దారితీసే కారకాలు.

breast cancer

స్మోకింగ్, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం బాగా పెరుగుతుంది. కొన్ని రకాల ఆహారాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటంటే..

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం అస్సలు మంచిది కాదు. దీన్ని తినే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో రోజుకు 9 గ్రాముల కంటే ఎక్కువ ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని యుకె బయోబ్యాంక్ అధ్యయనం తెలిపింది.
 

ఫాస్ట్ ఫుడ్

క్రమం తప్పకుండా ఫాస్ట్ ఫుడ్ తినే మహిళలకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం  పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉండే యాక్రిలామైడ్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆహారాన్ని వేడి నూనెలో వేయించినప్పుడు అవి హెటెరోసైక్లిక్ అమైన్ లను,  పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్లు,  యాక్రిలామైడ్ వంటి క్యాన్సర్ ను కలిగించే సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి.

Image: Getty Images

చక్కెర 

రొమ్ము క్యాన్సర్ కు తీపి నేరుగా కారణం కాదు. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

శుద్ధి చేసిన పిండి

శుద్ధి చేసిన పిండి పదార్ధాల వాడకంతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైట్ బ్రెడ్, పాస్తా, కాల్చిన ఆహారాలు మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది.

మద్యపానం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. మద్యపానం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.

click me!