మీకు కోపం ఎక్కువా..? అయితే వీటిని మాత్రం అస్సలు తినకండి..

First Published Aug 10, 2022, 10:55 AM IST

అయిన దానికి.. కాని దానికి కోపం వస్తుంటుందా..? అయితే కొన్ని ఆహారాలను తీసుకోవద్దంటున్నా నిపుణులు. ఎందుకంటే ఈ ఆహారాలు కోపాన్ని అమాంతం పెంచేస్తాయి మరి..
 

కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా అరుస్తుంటారు. ఇదేందీ ఈ విషయానికి కూడా కోపం వస్తుందా? అని ఇతరులు అనుకోవడం చాలా సహజం. అయితే ఇలా కోపం రావడానికి కూడా కారణాలున్నాయండోయ్. ఇంట్లో ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, ఆఫీస్ ప్రాబ్లమ్స్, కుటుంబ కలహాలు, లవ్ ఫెయిల్యూర్, మోసం వంటివెన్నో ఒక వ్యక్తి కోపానికి కారణాలుగా చెప్పొచ్చు. కానీ కోపానికి ఇవొక్కటే కారణాలు కాదు. మనం తినే ఆహారం కూడా మన కోపాన్ని పెంచుతుందన్న సంగతి మీకు తెలుసా..? ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకుంటే కోపం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కాలీఫ్లవర్ (Cauliflower)

కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. దీన్ని తినడం వల్ల రాఫినోస్ అనే రకం కార్బోహైడ్రేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఇది మీ కోపానికి దారితీస్తుంది. బ్రొకోలీ తీసుకోవడం వల్ల కూడా కోపం పెరుగుతుంది.

డ్రై ఫ్రూట్స్  (Dry Fruits) 

డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఆరోగ్యం బాగుండాలంటే వీటిని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే ఇవి కూడా కోపాన్ని మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కోపం ఎక్కువగా ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ జోలికి వెళ్లకూడదు. 
 

టొమాటో (Tomato)

టమోటాలు లేకుండా అసలు వంటే కాదు. అందుకే ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా.. టొమాటో మాత్రం పక్కాగా ఉంటుంది. టొమాటోలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే కోపాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ముక్కు మీదే కోపం ఉన్నవారికి టొమాటాలో తను తింటే ఆ కోపం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే వీరు టమాటాలను తక్కువగా తినాలి.
 

పుచ్చకాయ, కీరదోస

కీరదోసకాయ, పుచ్చకాయల్లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరాన్నిహైడ్రేట్ గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. కానీ వీటిని వీటిని ఎక్కువగా తినడంవల్ల కోపం విపరీతంగా పెరిరగిపోతుంది. అందుకే మీరు ఒత్తిడిలో ఉంటే ఈ జ్యూసీ పండ్లను తినకండి. 
 

వంకాయ  (eggplant)

వంకాయతో ఆమ్ల పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కోపాన్ని కలిగిస్తుంది. ఈ కూరగాయను తిన్న తర్వాత కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని తినడం తగ్గించండి. 
 

చిప్స్ (Chips) 

చిప్స్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. కానీ చాలా మంది చిప్స్ నే ఎక్కువగా తింటుంటారు. అయితే కోపం ఎక్కువగా ఉండే వారు మాత్రం చిప్స్ కు కాస్త దూరంగానే ఉండాలి. ఎందుకంటే ఇవి కోపాన్ని మరింత ఎక్కువ చేస్తాయి. 
 

కాఫీ (Coffee)

టీతో పాటుగా కాఫీ ప్రియులు కూడా ఎక్కువగానే ఉన్నారు. కాఫీని తాగడం వల్ల సోమరితనం పోయి పాణం హుషారుగా మారుతుందని వీటిని ఎక్కువగా తాగుతుంటారు. కాఫీని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో కారణం కాఫీలో కెఫిన్. శరీరంలో శక్తి ఎక్కువగా ఉంటే మెదడు ఉత్తేజితమవుతుంది. అలాగే దూకుడును పెంచుతుంది. ఇది కోపానికి దారితీస్తుంది.
 

పాల ఉత్పత్తులు (Dairy products), గోధుమలు

పాల ఉత్పత్తులు, గోధుమలలో ఉండే కేసిన్ కోపాన్ని పెంచుతుంది. అందుకే కోపం ఎక్కువగా ఉండేవారు పాల ఉత్పత్తులను, గోధుమలతో తయారైన ఆహారాలను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. 
 

click me!