శృంగారం గురించి ఈ వాస్తవాలు తెలిస్తే.. ఆశ్యర్యపోతారు...!

First Published | Oct 25, 2021, 11:49 AM IST

శృంగారం గురించి తెలియని ఎన్నో వాస్తవాలున్నాయని.. వాటిని తెలుసుకుంటే జీవితాంతం చక్కటి అనుబంధాన్ని కొనసాగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. 

భార్యాభర్తల మధ్య జీవితకాలపు చక్కటి అనుబంధానికి... వారి మధ్య  ఆత్మీయత, అనురాగాలు పెంపొందించడానికి శృంగారం మొదటి మెట్టుగా పనిచేస్తుంది. పెళ్లైన కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. శారీరక కోరికలు తీర్చుకోవడానికి పనికివచ్చే శృంగారం.. ఆతరువాతి కాలంలో వారిద్దరి మధ్య బంధం బలపడడానికి పనికివస్తుంది. 

అయితే, శృంగారం అనగానే కేవలం పడకగదికి పరిమితమైన చర్యగా, దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడని మనస్తత్వాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే శృంగారం గురించి ఎంత ఎక్కువ అవగాహన ఉంటే సంసారం అంత సాఫీగా సాగుతుందట. 

Latest Videos


శృంగారం గురించి తెలియని ఎన్నో వాస్తవాలున్నాయని.. వాటిని తెలుసుకుంటే జీవితాంతం చక్కటి అనుబంధాన్ని కొనసాగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. 

వారంలో ఒకసారి..
నేటి బిజీ జీవితంలో శృంగారం అంటే పెద్దగా ఆసక్తి చూపడంలేదు జంటలు. అయితే వారానికి ఒకసారి సెక్స్ లో పాల్గొనే జంటలు వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. 

స్త్రీలు అలా చూడగానే.. ఇలా సెక్స్ చేయాలని కోరుకోరు. తాము ఎవరినైతే ఇష్టపడుతున్నారో.. వారిని కనీసం రెండు, మూడు వారాలు గమనించిన తరువాతే వారితో శృంగారానికి ఇష్టపడతారట

అడల్ట్ మూవీస్, సెక్స్ మూవీస్ చూసిన తరువాత పురుషుల్లో సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందట.. బెడ్ మీద ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారట. తన భాగస్వామిని సంతృప్తి పరచడంలో కృతకృతులవుతారట..

ఇక ఒక వ్యక్తి ఎవరితోనైతే శృంగారంలో పాల్గొనాలనుకుంటాడో.. అతను తను ఇష్టపపడిన అమ్మాయి ఏం చెప్పినా తలూపుతూ ఉండాలి, ఆమె నవ్వినప్పుడు నవ్వడం.. ఏం చేసినా అంగీకరించడం ద్వారా బెడ్ మీద ఆమెను సంతృప్తి పరుస్తారట.

గాఢనిద్ర పోయిన తరువాతి రోజు శృంగారంలో రెచ్చిపోవడానికి కావాల్సిన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతారట. ఇద్దరూ కలిసి ఇంటిపనులు, వంటపనులు పంచుకునే జంటలు చక్కటి శృంగార జీవితాన్ని అనుభవిస్తారట. వారికి మూడ్ వచ్చినప్పుడు కిచెన్ లో లేదా బెడ్ రూంలో .. ఎక్కడ పడితే అక్కడ.. ఎంజాయ్ చేస్తారట. 

చక్కటి శృంగార జీవితం మీ ఆర్థికాభివృద్ధికి కూడా బాగా తోడ్పడుతుందట. సంతృప్తి కరమైన శృంగారం అంటే శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉండడం.. ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండడం. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారాల్లో చురుకుగా ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమవతుందట.

అతిముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. అందంగా, చూడచక్కగా ఉండడం.. హ్యాండ్ సమ్ గా ఆరడుగుల బుల్లెట్ లా ఉండడం అనేవి.. బెడ్ మీద మ్యాటర్ కాదట. బెడ్ మీద ఎలా ఉంటున్నారు. సెక్స్ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు? మీ భాగస్వామిని ఏ మేరకు సంతృప్తి పరుస్తున్నారనేదే ముఖ్యమట. 

click me!