ఈ యాప్‌లో ట్రైన్ టికెట్స్ అంత తక్కువా? కచ్చితంగా మనీ సేవ్ అవుతుంది

First Published | Nov 24, 2024, 2:29 PM IST

మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీకు డబ్బులు ఆదా అవ్వాలన్నా? ఇతర బెనిఫిట్స్ పొందాలన్నా? ప్రత్యేక ఆఫర్లు కావాలన్నా ఒక యాప్ ఉంది. అక్కడ నుంచి మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే మీకు అన్ని విధాలుగా డబ్బులు సేవ్ అవుతాయి. ఆ యాప్ గురించి తెలుసుకుందాం రండి. 

ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైళ్ల లోనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. బస్సులు, కారుల్లో ప్రయాణించేటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. వాటితో పోలిస్తే తక్కువ ధరకు హాయిగా, ప్రశాంతంగా ట్రైన్స్ లో ప్రయాణం చేయొచ్చు. అందుకే ఎక్కువ మంది ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.

ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి అనేక మార్గాలున్నాయి. రైల్వే స్టేషన్ల లో రిజర్వేషన్ కౌంటర్ల దగ్గరకు వెళ్లి డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. లేదా చాలా చోట్ల రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ఉంటాయి. అక్కడకు వెళ్లినా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఆన్ లైన్ లో అనేక ప్రైవేట్ యాప్స్‌ ఉపయోగించి టికెట్స్ రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ప్రైవేట్ యాప్స్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. దీనివల్ల ఆటోమెటిక్ గా టికెట్ ధర పెరుగుతుంది. అయితే తక్కువ ధరకే టికెట్లు బుక్ చేసుకునే మార్గం ఒకటి ఉంది.


మీరు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకే దొరుకుతాయి. అదనపు ఛార్జీలు కూడా ఉండవు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందించే ప్రభుత్వ రంగ సంస్థ. ఇది 1999లో స్టార్ట్  అయ్యింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకు IRCTCలో సుమారు 66 మిలియన్ల మంది వినియోగదారులుగా నమోదై ఉన్నారు. IRCTC యాప్, వెబ్ సైట్ ద్వారా రోజుకు దాదాపు 7.31 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి.

ప్రయాణికుల సౌకర్యం కోసం IRCTC ఎప్పటికప్పుడు రైల్వే టిక్కెట్లపై డిసౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇటీవలే ఆ సంస్థ 25వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగానే 75 శాతం రాయితీతో రైలులో ప్రయాణించే సౌకర్యాన్ని ప్రయాణికులకు ఇచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంది. అందువల్ల మీరు ఈ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఏదో ఆఫర్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. 

IRCTC ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ప్రతి రిజర్వేషన్ లోనూ రూ.100 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రయాణ దూరం, కోచ్‌ని బట్టి సేవ్ అయ్యే డబ్బు పెరగచ్చు లేదా తగ్గొచ్చు. 

హైస్పీడ్, ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లతో సహా ఇతర రైల్వే సేవల్లోనూ IRCTC డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం విద్యార్థులు, అంధులు, వికలాంగులు, పారా పెలాజిక్, క్షయ, క్యాన్సర్ రోగులు, కిడ్నీ, లెప్రసీ రోగులకు ఛార్జీల్లో రాయితీలు ఇస్తారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భద్రతా బలగాల జీవిత భాగస్వాములు, యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు, జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు, లేబర్ అవార్డు గ్రహీతలు, పోలీసు అమరవీరుల భార్యలు, సీనియర్ సిటిజన్లు రైల్వే టిక్కెట్ ధరల్లో రాయితీలు పొందడానికి  అర్హులు. ఇలా ప్రతి ఒక్కరికీ IRCTC టికెట్ ధరల్లో డిస్కౌంట్ ఇస్తుంటుంది. అందువల్ల మీకు టికెట్ ధరల్లో తగ్గింపు కావాలంటే  IRCTC బెస్ట్ ఆప్షన్. 

Latest Videos

click me!