తొడల ప్రాంతంలో కొవ్వా? ఈ స్క్వాట్స్ ట్రై చేయండి...

First Published Nov 5, 2021, 2:46 PM IST

రకరకాల స్వ్కాట్స్ చేయడం వల్ల కేవలం తొడల ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడమే కాదు.. శరీరానికి ఇంకా అనేక లాభాలున్నాయి. కాళ్లను తొడలను tone చేస్తాయి. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే... నా కళ్లు.. ’ అని పాటలు పాడుకునే అంత అందంగా మీ కాళ్లు తయారయ్యేలా చేస్తాయి. 

Skin Care : How to deal with inner thigh hyperpigmentation

పొట్ట దగ్గరి కొవ్వు లాగే.. తొడల భాగంలో ఉండే కొవ్వు కూడా చాలా మొండిది. అంత తొందరగా కరగదు. ఒక్కసారి కొవ్వు పేరుకోవడం మొదలయితే.. దాన్ని కరిగించడం అంత సులభం కాదు. చేరకుండా చూసుకోవడం ఒకెత్తయితే.. కొన్ని రకాల వ్యాయామాల వల్ల తొడల ప్రాంతంలో పేరుకునే కొవ్వును సులభంగా కరిగించొచ్చు. 

వాటిల్లో స్క్వాట్స్ ఒకటి. అయితే స్క్వాట్స్ లోనూ అనేక రకాలుంటాయి. రకరకాల స్వ్కాట్స్ చేయడం వల్ల కేవలం తొడల ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడమే కాదు.. శరీరానికి ఇంకా అనేక లాభాలున్నాయి. కాళ్లను తొడలను tone చేస్తాయి. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే... నా కళ్లు.. ’ అని పాటలు పాడుకునే అంత అందంగా మీ కాళ్లు తయారయ్యేలా చేస్తాయి. దీంతోపాటు నడుము, butt ను ఆరోగ్యంగా చేస్తుంది. పూర్తి శారీరక ఆరోగ్యానికి పనికి వస్తుంది. 

squat exercises తొడల ప్రాంతంలోని కొవ్వును కరిగిస్తాయి. అలాంటి కొన్ని రకాల వ్యాయామాలు తెలుసుకుంటే.. రోజూ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చు. 

జంప్ స్క్వాట్స్... ఈ jump squats వల్ల thigh fat కరగడమే కాదు.. కండరాలు బలంగా తయారవుతాయి. దృఢంగా తయారవుతారు. బాలెన్స్ బాగుంటుంది. మొబిలిటీ పెరుగుతుంది. 

సూమో స్క్వాట్స్ నడుం కింది శరీరాన్ని బలోపేతం చేస్తుంది. sumo squats తో కేవలం తొడల ప్రాంతంలోని కొవ్వు కరగడమే కాదు.. క్వాడ్రిసెప్స్, హామ్ స్ట్రింగ్స్, హిప్ ఫ్లెక్సర్స్, గ్లుటెస్, కాల్వ్స్... నడుం కింది భాగంలో ఉండే కండరాలను బలోపేతం కావడానికి అద్భుతంగా పనికి వస్తాయి. 

Belly fat VS Thigh Fat

వాల్ స్క్వాట్స్ : wall squats ముఖ్యంగా గ్లుటెస్, క్వాడ్స్, హామ్ స్ట్రింగ్స్ బలోపేతానికి చక్కగా పనిచేస్తాయి. వీటిమీదే ఎక్కువగా ఫోకస్ అవుతాయి. దీంతోపాటు తొడల ప్రాంతంలో కొవ్వును కరిగించడంలో కూడా బాగా పనిచేస్తాయి.

ఒక్క కాలితో చేసే స్క్వాట్స్... ఈ single leg squats కొంచెం కష్టమైనవే. కానీ నడుం కింది భాగం దృఢంగా తయారవ్వడానికి బాగా పనికొస్తాయి. లెగ్స్ టోనింగ్ తో పాటు మీ శరీరాకృతి మెరుగుపరుస్తుంది. స్టెబులిటీని ఇస్తుంది. డంబెల్స్ పట్టుకుని స్క్వాట్స్ చేయడం వల్ల మీరనుకున్నదానికంటే మరిన్ని ప్రయోజనాలు మీకు కలుగుతాయి. 

గోబ్లెట్ స్క్వాట్స్.. లోయర్ బాడీలోని దాదాపు అన్ని కండరాల మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ goblet squat చేయడం వల్ల గాయాలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ స్క్వాట్స్ వల్ల తొడల ప్రాంతంలోని కండరాలతో పాటు forearms మజిల్స్ కూడా బలోపేతం అవుతాయి. 

Winter: సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తినాలి..?

click me!