ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్లు మండకూడదంటే ఏం చేయాలి?

First Published | Jan 18, 2024, 11:40 AM IST

ఉల్లిపాయలను తరగాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ వాటిని తరగుతుంటే కళ్లు మండిపోతాయి. దీనివల్ల కళ్లోంచి నీళ్లు వస్తాయి. దీనికి భయపడే చాలా మంది ఉల్లిపాయలను తరగడానికి ఇష్టపడరు. అయితే కొన్ని ట్రిక్స్ ను పాటిస్తే కళ్లు మండవు, కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాదు. 

ఉల్లిపాయలను కట్ చేయాలంటే చాలా మంది భయపడిపోతుంటారు. కొంతమంది అయితే హెల్ మెట్ ను పెట్టుకుని మరీ కట్ చేస్తుంటారు. ఎందుకంటే ఉల్లిపాయలను కట్ చేయడం వల్ల చేతుల్లో వాసన రావడమే కాదు.. కళ్లు బాగా మండిపోతాయి. అలాగే కళ్లలోంచి నీరు కూడా వస్తుంది. దీనికి బయపడే చాలా మంది ఉల్లిపాయలను అస్సలు కట్ చేయరు. కానీ మనం తినే ప్రతి కూరలో ఉల్లిపాయలను ఖచ్చితంగా వేస్తాం. కాబట్టి ఉల్లిపాయలను ఖచ్చితంగా తరగాల్సిందే. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కళ్లు మండకూడదన్నా.. నీళ్లు రాకూడదన్నా కొన్ని ట్రిక్స్ ను పాటిస్తే సరిపోతుంది. అవును ఇవి మీరు ఉల్లిపాయలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్ చేయడానికి సహాయపడతాయి. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

 ఉప్పు నీటిలో నానబెట్టడం

ఉప్పు నీరు కూరగాయ చేదును తొలగిస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలియదు. ఉప్పు ఒక్క చేదునే కాదు కూరగాయల ఘాటును కూడా  తగ్గిస్తుంది. సలాడ్లలోకి ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు ఉల్లిపాయలను ఉప్పు నీటిలో కొద్దిసేపు నానబెట్టండి. ఆ తర్వాత కట్ చేస్తే మీకు అస్సలు ఎలాంటి సమస్యలు రావు. కళ్లు మండవు. 
 

Latest Videos


అలాగే ఉల్లిపాయల తొక్క తీసి శుభ్రం చేయండి. తర్వాత ఉల్లిపాయలను రెండు భాగాలుగా కట్ చేయండి. ఇప్పుడు దీనిపై కొంచెం ఉప్పు చల్లి బాగా మ్యారినేట్ చేసి తర్వాత నీళ్లు పోసి 5-7 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మీకు నచ్చినట్టుగా ఉల్లిపాయలను కట్ చేయండి. 
 

ఉల్లిపాయల ఘాటు తగ్గాలంటే మీరు వాటిని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఉల్లిపాయల్లోనే ఘాటు తగ్గాలంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని అందులో 5-6 ఐస్ క్యూబ్స్ ను వేసి అవి కరిగేదాక వెయిట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు అందులో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తే కన్నీళ్లు రావు. చికాకు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఉల్లిపాయను ఫ్రిజ్ లో పెట్టడానికి సమయం లేనప్పుడు మీరు ఈ పని చేయొచ్చు.
 

మీకు తెలుసా? ఉల్లిపాయ తొక్క తీసి రెండు భాగాలుగా కట్ చేసి కొద్ది సేపు వెయిట్ చేసి కట్ చేయండి. దీనివల్ల మీకు ఉల్లిపాయల వల్ల కన్నీళ్లు అసలే రావు. అలాగే ఉల్లిపాయలను వెంటవెంటనే కోయడం వల్ల కూడా కళ్లు మండవు. మీకు ఉల్లిపాయలను కట్ చేయడం ఇష్టం లేకపోతే.. ఉల్లిపాయను తరిగే యంత్రంలో కట్ చేయడం ఉత్తమ మార్గం. ఇది మీ పనిని నిమిషాల్లో పూర్తి చేస్తుంది.

click me!