మన గుండె గురించి మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా?

First Published | Nov 21, 2023, 3:57 PM IST

మన గుండె కొట్టుకున్నంత వరకే మనం ప్రాణాలతో ఉండేది. అందుకే గుండె విషయంలో జాగ్రత్తగా ఉంటారు. గుండె ఏం చేస్తుందంటే మనల్ని బతికించడానికి పనిచేస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలుసు. కానీ గుండె గురించి ఎన్నో విషయాలు మనలో చాలా మందికి తెలియవు. పదండి మరి మనిషి గుండె అదే మన గుండె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలను తెలుసుకుందాం.. 
 

గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?

వయోజనులు గుండె సగటున నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే రోజుకు 100,000 సార్లు కొట్టుకుంటుంది. సంవత్సరానికి 36,000,000 సార్లు మన గుండె లబ్ డబ్ మని కొట్టుకుంటూనే ఉంటుంది.
 

heart health

గుండె బరువు ఎంత?

మన గుండె బరువు మన శరీర బరువులో ఎంత బరువుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల ప్రకారం.. ఆరోగ్యకరమైన గుండె సగటున 11 ఔన్సుల బరువు ఉంటుంది. అలాగే మన గుండె ప్ర0తిరోజూ 60,000 మైళ్ల రక్త నాళాల ద్వారా 2,000 గ్యాలన్ల రక్తాన్ని పంప్ చేస్తుంది. 
 

Latest Videos


శరీరం ద్వారా రక్తం ఎలా పంపిణీ అవుతుంది?

మన గుండెకు 5%  రక్తం వెలుతుంది. అలాగే మెదడుకు 20%, కేంద్ర నాడీ వ్యవస్థకు వెళుతుంది. ఇక మన మూత్రపిండాలకు 22% రక్తం పంపిణీ అవుతుంది. 

ఎన్ని కణాలు రక్తాన్ని స్వీకరిస్తాయి?

75 ట్రిలియన్ కణాలు గుండె నుంచి పంప్ చేయబడిన రక్తాన్ని స్వీకరిస్తాయి.

heart

మానవ హృదయం శక్తివంతమైన కండరమా?

మన జీవితకాలంలో మన గుండె ఏకంగా 2.5 గిగాజౌల్స్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది అత్యంత శారీరక పని చేసే కండరంగా మారుతుంది.

ఎవరి గుండు వేగంగా కొట్టుకుంటుంది? ఆడవారిదా? మగవారిదా? 

ఆడవాళ్లకు, మగవాళ్లకు ఒకే రకమైన గుండె ఉంటుంది. ఇక గుండె కొట్టుకోవడానికి తేడా ఏముంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా అనుకుంటే పొరపాటే. ఆడవారి గుండె మగవారి గుండె కంటే వేగంగా కొట్టుకుంటుంది. ఆడవారి గుండె నిమిషాలనికి 78 సార్లు కొట్టుకుంటుంది.  మగవారి గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. 
 

heart

నిద్రలేమి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా?

దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల అకాల జఠరిక సంకోచాలు (పీవీసీ) అని పిలువబడే క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. 

అన్ని అవయవాలకు రక్తం అందుతుందా?

కార్నియాలు మాత్రమే గుండె నుంచి రక్తాన్ని తీసుకోని శరీరంలోని భాగాలు. వారికి రక్త నాళాలు ఉండవు. అందుకే అవి రక్తాన్ని తీసుకోవు. ఇవి కన్నీళ్లు, వాటర్ ద్వారా పోషకాలను పొందుతాయి.

click me!