తమ మల్టీస్టారర్ చిత్రానికి చరణ్ - అర్జున్ అనే టైటిల్ కూడా రాంచరణ్ ప్రస్తావించారు. అయితే కథలో తమ పాత్రలో నెగిటివ్ రోల్స్ గా ఉండాలని.. అలాంటి కథ కుదిరితే తప్పకుండా మల్టీస్టారర్ మూవీ చేస్తాం అని రాంచరణ్, అల్లు అర్జున్ గతంలో తెలిపారు. చరణ్, అల్లు అర్జున్ లతో పూర్తి స్థాయి మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉన్నట్లు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మనసులో మాట బయటపెట్టారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్స్ లో అల్లు అర్జున్, చరణ్ కలసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.