మూత్రపిండాల గురించి మీకు ఈ విషయాలు తెలియనే తెలియవు

Published : Nov 23, 2023, 04:28 PM IST

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రిపండాలు ఒకటి. ఎందుకంటే ఇది మన రక్తం నుంచి అదనపు నీటిని, హానికరమైన విషాలను బయటకు పంపుతుంది. ఇవి పనిచేయడం ఆగితే మన ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. అసలు మన మూత్రపిండాల గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
మూత్రపిండాల గురించి మీకు ఈ విషయాలు తెలియనే తెలియవు

మూత్రపిండాలు ఎందుకు ముఖ్యమైనవంటే? 

ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి.
మన శరీరంలో సరైన మోతాదులో ద్రవాలు ఉండేలా చూస్తాయి. 
ఎర్ర రక్త కణాల తయారీకి సహాయపడుతాయి.
రక్తపోటును అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి. 
 

26
kidney health

మూత్రపిండాల వ్యాధికి ప్రమాద కారకాలు ఇవే

డయాబెటిస్
అధిక రక్తపోటు
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండటం
మూత్రపిండాల వ్యాధి, డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం
 

36

కాలక్రమేణా మూత్రపిండాల వ్యాధి..

మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది
గుండె, రక్తనాళాల వ్యాధిని కలిగిస్తుంది
ఇతర ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. 
 

46

ప్రతి రోజూ సగటున మన మూత్రపిండాలు 0.94 నుంచి 1.7 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి 112 నుంచి 144 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి.

అలాగే మూత్రపిండాలు ఎన్నో శారీరక విధులను నియంత్రించే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. రక్తపోటును నియంత్రించే హార్మోన్లలో రెనిన్ ఒకటి.

మూత్రపిండాల ప్రాథమిక, క్రియాత్మక యూనిట్ ను నెఫ్రాన్స్ అంటారు. ఇవి మన రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి సహాయపడతాయి. మన మూత్రపిండాలు మిలియన్ల నెఫ్రాన్లతో తయారవుతాయి.
 

56

మూత్రపిండాల్లో రాళ్లు మూత్రంలో ఉండే ఖనిజాలు గడ్డకట్టే లేదా స్ఫటికంగా మారే పరిస్థితి. ఇవి మూత్ర ప్రవాహాన్ని ఆపేంత పెద్దగా కూడా పెరుగుతాయి. 

ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కిడ్నీ స్టోన్ 4.25 కిలోల బరువు ఉందంటే నమ్ముతారా.

పాలు, గుడ్లు, జున్ను వంటి ఆహారాల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది.ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పది రెట్లు పెంచుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
 

66

సగటు మానవ మూత్రపిండం మూసిన పిడికిలి కంటే పెద్దదిగా ఉండదు. అలాగే ఇవి 0.4 కిలోల కంటే తక్కువ బరువు ఉంటాయి. 

మూత్రపిండాలలో ఉన్న నెఫ్రాన్ల సంఖ్య సంవత్సరానికి 1% తగ్గడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

మూత్రపిండాల వ్యాధి వచ్చిన తర్వాత దానిని పూర్తిగా తగ్గించలే. కేవలం దాని ప్రభావాలను మాత్రమే తగ్గించగలం. 

Read more Photos on
click me!

Recommended Stories