సెక్స్ అనే మాట కాస్త ఇబ్బందికరంగా అనిపించినా.. దీనివల్ల స్త్రీ, పురుషులిద్దరికీ ఎన్నో ప్రయోజనాలున్నాయి. వైవాహిక జీవితంలో శృంగార జీవితం బాగుంటేనే చాలు.. మితగా లైఫ్ మొత్తం ఆనందంగా, ఆహ్లాదంగా గడిచిపోతుందని నిపుణులు చెబుతుంటారు. ఈ సంగతి అటుంచితే.. పురుషులతో పోల్చితే ఆడవారిలోనే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని కొందరు అంటుంటారు. అయితే స్త్రీలు సెక్స్ ను ఎంజాయ్ చేయాలంటే ముందుగా వారి లైంగిక అవయవాలు ఉత్తేజితం కావాలి. ఇలా కావాలంటే.. వారి లైంగిక అవయవాల గురించి తెలుసుకోవాలి.
నిజానికి స్త్రీలలో 3 కంటె ఎక్కువ లైంగిక అవయావాలు ఉంటాయి. అందులో బాహ్య లైంగిక అవయవాలు: 1. బ్యాహ్య లాబియా (లాబియా మేజోరా), లోపలి లాబియా (లాబియా మైనోరా), యోని వెస్టిబ్యూల్, బార్తోలిన్ గ్రంథులు.
అంతర్గత స్త్రీ లైంగిక అవయవాలు: అండాశయాలు, ఫలోపియన్ గొట్టాల, గర్భాశయం (గర్భం), యోని. ఇవి కేవలం పునరుత్పత్తి అవయవాలు మాత్రమే కాదు.. ఇవి ఆడవారిలో లైంగిక కోరికలను కలిగిస్తాయి.
sexual releation
స్త్రీలలో లైంగిక ఆనందం తారాస్థాయికి చేరుకోవడానికి శరీరక, మానసిక ప్రతిస్పందనలనే ఉద్వేగం అంటారు. అయితే స్త్రీలు ఉద్వేగాన్ని పొందే విధానం పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది మొదట శారీరక ప్రతిస్పందనలతో ప్రేరేపించబడుతుంది. ఇక రెండో దశలో క్లిటోరిస్ ప్రతిస్పందించడం ప్రారింభిస్తుంది. ఇక మూడో దశ భావప్రాప్తికి ముందు ఉంటుంది. దీనిలో గుండె కొట్టుకే వేగం ఎక్కువగా ఉంటుంది. ఇక చివరిది ఉద్వేగం.
ఆడవారిలో అత్యంత సంభావ్య లైంగిక అవయవాలలో ఒకటైన క్లిటోరిస్ గురించి చాలా మందికి తెలియదు. ఈ భాగం 8,000 కంటె ఎక్కువ నరాల చివరలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత సెక్స్ కోరకలను రేకెత్తించే అవయవాల్లో ఒకటిగా చెప్తారు. 75% కంటే ఎక్కువ మంది మహిళల్లో క్లిటోరిస్ ను తాకినప్పుడు మాత్రమే ఉద్వేగం క్లైమాక్స్ చేరుకుంటుందట. సాధారణంగా క్లిటోరిస్ ఉద్వేగం 20 సెకన్ల పాటు ఉంటుంది.
Sex-06
క్లిటోరిస్ మెజారిటీ భాగం కనిపించకపోవడం, అంతర్గతంగా ఉండటం వల్లే ఇలా అవుతుంది. అయితే ఇది కనిపించకపోవడం వల్లే దీన్ని ఉద్వేగ అవయవంగా చూడరు. క్లిటోరిస్ వల్ల కలిగే ఏకైక ప్రయోజనం స్త్రీకి ఆనందం ఇవ్వడమే..
ఇకపోతే కొంతమంది మహిళలకు.. రొమ్ములు, చనుమొనలను తాకితే కూడా సెక్స్ కోరికలు రేకెత్తుతాయి. అందుకే సెక్స్ లో ఉద్వేగం పొందడానికి ఇవి కూడా సహాయపడతాయి. ఆడవారిలో అత్యంత సాధారణ ఎరోజెనస్ జోన్లలో చనుమొనలు ఒకటి. చనుమొనలను తాకడం వల్ల జననేంద్రియాలు ప్రేరేపించబతాయని అధ్యయనాలు కనుగొన్నాయి. స్త్రీ ఆనంద అవయవాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. వీటి సంకేతాలు ప్రతి అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఇవి స్త్రీలకు ఆనందాన్ని ఇస్తుంది.
సంభోగం సమయంలో మీ భాగస్వామి ఆనందించాలంటే లైంగిక శరీర నిర్మాణ శాస్త్రంపై ఎక్కువ దృష్టి పెట్టండి. దీనివల్ల ఇద్దరూ ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మీ ఇద్దరికీ ఏది ఉత్తమంగా పనిచేస్తుందో ముందు తెలుసుకోండి. సెక్స్ లో ఫోర్ ప్లే ఒక సమగ్ర పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని మిస్ చేయకండి. నిజానికి ఫోర్ ప్లేలో పాల్గొనడం వల్ల భావప్రాప్తి కంటే మీకు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు.