ఈ పండుతో మీరెంత అందంగా మారిపోతారో..!

First Published Jan 6, 2023, 4:18 PM IST

చలికాలంలో చర్మ సమస్యలు రావడం చాలా కామన్. బాడీ డీహైడ్రేషన్, దుమ్ము, దూళి, పొడి వాతావరణం వంటివి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల పండ్లను తింటే మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

Image: freepik.com

ఆరోగ్యానికి , అందానికి బొప్పాయి చేసే మేలు ఎంతో. బొప్పాయి పండులో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. బొప్పాయిలో విటమిన్ ఎ తో పాటుగా విటమిన్ సి, లైకోపీన్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మీ చర్మాన్ని మెరిసేలా, అందంగా, యవ్వనంగా చేసే యాంటీఆక్సిడెంట్లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. 
 

papaya

చర్మంపై మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. అయితే బొప్పాయి పండు మీ చర్మంపై ఉన్న మచ్చలను పోగొడుతుంది. ఈ పండులోని కొన్ని లక్షణాలు చర్మంపై ఉండే మచ్చలను, పిగ్మెంటేషన్ ను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన స్కిన్ ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేసి స్కిన్ పై మృత కణాలను తొలగిస్తుంది. దీంతో మీ ముఖం మరింత మృదువుగా మారుతుంది. బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్, మొక్కల సమ్మేళనాలు చర్మాన్ని మరింత కాంతివంతంగా మారుస్తాయి. అలాగే స్కిన్ రంగును కూడా పెంచుతాయి. 

పొడి చర్మ సమస్యలను పరిష్కరించడానికి, చర్మాన్ని తేమగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పొడి చర్మాన్ని నివారిస్తాయి. అలాగే మీ చర్మం మరింత మెరిసేలా  చికిత్స చేయడానికి సహాయపడతాయి. బొప్పాయి గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. 
 

బొప్పాయిలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను పోగొడుతాయి. బొప్పాయి తొక్కలో కూడా ఎంజైమ్లు ఉంటాయి. చనిపోయిన కణాలు, వయస్సు మీద పడుతుంటే వచ్చే మచ్చలను తొలగించడానికి దీనిని స్కిన్ కు అప్లై చేయొచ్చు. 

నల్ల మచ్చలను, కాలిన గాయాలను, చర్మ వ్యాధులను నయం చేయడానికి బొప్పాయి ఒక సహజ నివారణిలా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ చనిపోయిన చర్మ కణాలను బయటకు పంపడానికిక సహాయపడుతుంది. అలాగే చర్మంపై మలినాలను తగ్గిస్తుంది.

తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా బొప్పాయి సహాయపడుతుంది. అంతేకాదు ఇది దురదను నివారించడానికి, చర్మం పై ఎరుపుదనాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం బొప్పాయి గుజ్జును చర్మంపై నేరుగా అప్లై చేయండి. బొప్పాయిలో ఉండే ఉపయోగకరమైన ఎంజైమ్లు, మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న కణాలు, కణజాలాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. 

click me!