ఈ సమస్యలున్న వాళ్లు పుట్టగొడుగులను అసలే తినకూడదు..

First Published Dec 10, 2022, 3:57 PM IST

పుట్టగొడులు హెల్తీ ఫుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. కానీ కొంతమంది పుట్టగొడుగులను అసలే తినకూడదు. ఒకవేళ తింటే.. 
 

పుట్టగొడుగుల్లో చాలా రకాలుంటాయి. కానీ వాటిలో కొన్నే మనం తినగలిగేవి. అయితే పుట్టగొడుగులతో చేసిన వంటలు సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతేకాదు దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ పుట్టగొడుగులను తినడం వల్ల  మన శరీరానికి విటమిన్ బి, విటమిన్ డి, రాగి, సెలీనియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అయితే మార్కెట్ లో ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉంటాయి. కానీ వాటిలో చాలా రకాలు హానికరం. అయితే చాలా మందికి ఏవి తినేవి? ఏవి తినకూడనివి? అన్న సంగతి తెలియదు. ఈ సంగతి పక్కన పెడితే కొన్ని శారీరక సమస్యలున్న వారు పుట్టగొడుగులను తినకూడదు. ముఖ్యంగా హానికరమైన పుట్టగొడుగులు. ఇంతకీ ఎలాంటి సమస్యలున్నవారు పుట్టగొడుగులను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అజీర్థి

తరచుగా అజీర్థి సమస్యతో బాధపడేవారు పుట్టగొడుగులను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది కడుపు అసౌకర్యాన్ని పెంచుతుంది. అలాగే వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఇలాంటి వారు పుట్టగొడుగులకు దూరంగా ఉండాలి. 
 

food allergy

చర్మ సమస్యలు

పుట్టగొడుగులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతామన్నప్పటికీ.. చర్మ సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ ఫుడ్ కు దూరంగానే ఉండాలి. ఒకవేళ అలాగే తింటే చర్మంపై దద్దుర్లు, చర్మం చిరాకు, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. 

Fatigue

అలసట

పుట్టగొడుగులను మోతాదుకు మించి తినడం మంచిది కాదు. ముఖ్యంగా అలసటతో  బాధపడేవారికి. శరీరంలో శక్తిలేకపోవడం వల్ల కొంతమంది ఊరికే అలసిపోతుంటారు. కొంతమంది పుట్టగొడుగులను తిన్న తర్వాత బాగా అలసటకు గురవుతారు. అందుకే ఒంట్లో శక్తి తక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులను తినకూడదు. 
 

pregnancy

గర్భిణులు

పై సమస్యలున్న వారే కాదు.. గర్భిణులు కూడా పుట్టగొడుగులను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లుల్లు, గర్భిణులు ఈ సూపర్ ఫుడ్ కూడా దూరంగా ఉండాలి. ఇవి వీరిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయంటున్నారు నిపుణులు. 
 

తలనొప్పి

తలనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. కొన్ని రకాల మందులు, ఒత్తిడి, నిద్రలేమి, సైనస్ వంటి ఎన్నో కారకాలు తలనొప్పిని కలిగిస్తాయి. అయితే కొంతమందికి పుట్టగొడుగులను తిన్న తర్వాత తలనొప్పి వస్తుంది. అదికూడా ఒకరోజుకంటే ఎక్కువ రోజులు. 

ఆందోళన

పుట్టగొడుగులు కొంతమందిలో  ఆందోళనను కూడా కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ఈ ఆందోళన స్థాయిలను తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయిల వరకు ఉండొచ్చు. పుట్టగొడుగులను మోతాదుకు మించి తిన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి. 

మానసిక ఆరోగ్యం

పుట్టగొడుగులను తినడం వల్ల కొంతమందిలో మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా పుట్టగొడుగులను తిన్న తర్వాత విపరీతమైన భయం, భయాందోళనలు వంటి మానసిక సమస్యలు వస్తాయట. 
 

మైకము

పుట్టగొడుగులను తిన్న తర్వాత కొంతమంది తీవ్రమైన మైకమును ఫేస్ చేశారని నివేధికలు చెబుతున్నాయి. పుట్టగొడుగులను మోతాదుకు మించి తింటే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు తక్కుక రక్తపోటు సమస్య ఉన్నవారు  స్పృహ కోల్పోయేలా చేస్తాయి. 

బరువు పెరుగుతారు

పుట్టగొడుగులను తిన్న తర్వాత ఆకలిగా అనిపిస్తుంది. వీటిలో ట్రిప్టామైన్లు ఉంటాయి. ఇవి యాంఫేటమిన్లు లాగా పనిచేసి ఆకలిని కలిగిస్తాయి. పుట్టగొడుగుల్లో ఎర్గోట్ ఆల్కలాయిడ్లు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను పెంచేందుకు, బరువు పెరగడానికి దారితీస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

click me!