బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే?

First Published | May 14, 2024, 1:48 PM IST

మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో బ్రేక్ ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ఉదయం వైట్ బ్రెడ్ ను ఎక్కువగా తింటుంటారు. మరికొంతమంది వైట్ బ్రెడ్ మంచిది కాదని బ్రౌన్ బ్రెడ్ ను తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ లో ఏది ఆరోగ్యానికి మంచిదంటే? 
 

బ్రెడ్ ను ప్రపంచ వ్యాప్తంగా తింటుంటారు. మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను తింటుంటారు. ఎందుకంటే బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే బ్రెడ్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వైట్ బ్రెడ్, రెండు బ్రౌన్ బ్రెడ్. ఆరోగ్యం విషయంలోకొస్తే చాలా మంది వైట్ బ్రెడ్ కు బదులుగా వైట్ బ్రెడ్ నే తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదంటే?
 


బ్రౌన్ బ్రెడ్ సాధారణంగా మొత్తం గోధుమ పిండితోనే తయారువుతుంది. వైట్ర బ్రెడ్ మైదా పిండితో తయారువుతుంది. అసలు ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 


ఫైబర్: బ్రౌన్ బ్రెడ్ వర్సెస్ వైట్ బ్రెడ్

ఫైబర్ విషయానికొస్తే బ్రౌన్ బ్రెడ్ లోనే పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల బ్రౌన్ బ్రెడ్ లో 4.7 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే 100 గ్రాముల వైట్ బ్రెడ్ లో 2.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అంటే బ్రౌన్ బ్రెడ్ లో సగం అన్న మంట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చూస్తాయి. అందుకే బరువు తగ్గేవారికి, డయాబెటీస్ పేషెంట్లకు బ్రౌన్ బ్రెడ్ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Image: Getty

చక్కెర: బ్రౌన్ బ్రెడ్ వర్సెస్ వైట్ బ్రెడ్

బ్రౌన్ బ్రెడ్ లో వైట్ బ్రెడ్ కంటే 1.6 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది. ఎందుకంటే బ్రెడ్ ను బ్రౌన్ చేయడానికి ఉపయోగించే క్యారమెల్ దీనికి అసలు కారణం. అలాగే చాలా కంపెనీలు గోధుమ రంగులో కనిపించడానికి దీనికి రంగును కూడా జోడిస్తాయి. 
 

ప్రోటీన్: బ్రౌన్ బ్రెడ్ వర్సెస్ వైట్ బ్రెడ్

ప్రోటీన్ గురించి మాట్లాడితే, 100 గ్రాముల బ్రౌన్ బ్రెడ్ లో  గ్రాములు,  100 గ్రాముల తెల్ల రొట్టెలో 9 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని బట్టి బ్రౌన్ బ్రెడ్ లోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 

కేలరీలు: బ్రౌన్ బ్రెడ్ వర్సెస్ వైట్ బ్రెడ్

కేలరీల పరంగా.. వైట్ బ్రెడ్ ముక్కలో 77 కేలరీలు, బ్రౌన్ బ్రెడ్ ముక్కలో 75 కేలరీలు ఉంటాయి. దీన్ని బట్టి చూస్తూ ఈ రెండూ మీరు బరువు పెరగడానికి దారితీస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం బ్రెడ్ ను తినకపోవడమే మంచిది. 

కొవ్వు: బ్రౌన్ బ్రెడ్ వర్సెస్ వైట్ బ్రెడ్

100 గ్రాముల బ్రౌన్ బ్రెడ్ లో 4.3 గ్రాముల కొవ్వు ఉంటుంది. వైట్ బ్రెడ్ లో  3.2 గ్రాములు కొవ్వు ఉంటుంది. అంటే బ్రౌన్ బ్రెడ్ లో సంతృప్త కొవ్వు ఆమ్లాల పరిమాణం వైట్ బ్రెడ్ లో కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు వీటిని తక్కువగా తీసుకుంటేనే మంచిది. 

Latest Videos

click me!