ఈ రోజుల్లో ఎక్కువ మంది కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఎవరి నోట విన్నా అదే సమస్య. తాము ఎంత ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడుతున్నా కూడా జుట్టురాలిపోతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే...అలా జుట్టురాలిపోపవడానికి మీరు తాగే కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం అని మీరు ఆలోచించారా..?
కూల్ డ్రింక్స్ తాగడం ఈ రోజుల్లో చాలా కామన్ గా మారిపోయింది. బయట ఎండలు మండిపోతూ ఉంటే.. ఉపశమనం కోసం కూడా ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. కానీ... ఈ కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా కారణంగా ఇలా జరుగుతుందని వారు చెబుతున్నారు.
ప్రతిరోజూ సోడా ఉన్న కూల్ డ్రింక్ తాగితే.. కచ్చితంగా జుట్టు రాలుతుందని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా జుట్టు జెనటికల్ ప్రాబ్లమ్, యాంక్సైటీ, బాడీ మాస్ ఇండెక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు, పొగ తాగే అలవాటు, ఫిజికల్ యాక్టివిటీ.. పలు కారణాల వల్ల రాలుతుంది. అయితే... కూల్ డ్రింక్స్ లో ఉండే షుగర్ కారణంగా కూడా పురుషుల్లో జుట్టు రాలుతుంది. ఓ యూనివర్శిటీ.. దాదాపు వెయ్యి మంది యువకులపై ఈ పరిశోధన చేయడం గమనార్హం. 18 నుంచి 45 వయసు ఉన్న పురుషులకు ఈ షుగరీ కూల్ డ్రింక్స్ ఇచ్చారు. రోజూ కేవలం ఒక్క డ్రింక్ మాత్రమే ఇచ్చారు. తర్వాత వారు జుట్టు పరిశీలించగా.. విపరీతంగా రాలిపోయినట్లు గుర్తించారు.
Hair loss
కేవలం రోజుకి ఒక్కటే కదా అని చాలా మంది భావించవచ్చు. కానీ... ఒక్క డ్రింక్ కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. కేవలం జుట్టు రాలడమే కాదు.. ఈ కూల్ డ్రింక్స్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి... వాటికి దూరంగా ఉండటమే మంచిది.