హెయిర్ కేర్ విషయంలో ఆడవాళ్ల కంటే మగవారే చాలా తక్కువ శ్రద్ధ చూపుతారనేది నిజం. అయితే ఆడవాళ్ల మాదిరిగా కాకుండా మగవారి జుట్టు చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అందుకే పురుషులు చాలా మంది రోజూ తలస్నానం చేస్తుంటారు.
కానీ ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా షాంపూల్లో సల్ఫేట్లు, ఇతర రసాయనాలు ఉంటాయి.
ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అలాగే జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. అందుకే ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పురుషులు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే, మీ జుట్టులో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. కాబట్టి మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే షాంపూతో తలస్నానం చేయాలి.
షాంపూ తలలో ఉండే దుమ్ము, ధూళి, అదనపు నూనెలను తొలగించడానికి సహాయపడుతుంది. అయితే మీరు షాంపూను మరీ ఎక్కువగా ఉపయోగిస్తే అది మీ జుట్టులోని సహజ నూనెలను తగ్గించి, జుట్టు పొడిబారడానికి, చిట్లడానికి దారితీస్తుంది.
మీరు ప్రతిరోజూ వ్యాయామం చేసేవారైతే లేదా మీకు ఎక్కువగా చెమట పడితే మీరు వారంలో ఒక రోజు తప్ప మరో రోజు షాంపూతో తలస్నానం చేయవచ్చు.
ముఖ్యంగా జిడ్డు జుట్టు ఉన్నవారు తరచుగా షాంపూతో తలస్నానం చేయొచ్చు. అయితే మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూను మాత్రమే ఉపయోగించండి.
అలాగే పొడి జుట్టు ఉన్నవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయకుండా ఉండటమే మంచిది. లేకపోతే మీ జుట్టు త్వరగా తెల్లబడిపోతుంది. అలాగే బట్టతల వస్తుంది.