మార్నింగ్ లేవగానే చాలా మంది కప్పు కాఫీ తాగే వరకు ఏ పనీ చేయరు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఉదయాన్నే విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కానీ పరిగడుపున కాఫీని మాత్రం తాగకూడదు.
మొక్కల ఆధారిత పాలు
కాఫీని తయారుచేయడానికి ఆవు లేదా గేదె పాలను వాడుతారు. కానీ వీటికి బదులుగా మొక్కల ఆధారిత పాలను ఉపయోగిస్తే మంచిది. ఈ పాలతో చేసిన కాఫీ టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం మీరు కొబ్బరి పాలు, బాదం, ఓట్స్ లను ఉపయోగించొచ్చు. ఈ కాఫీ క్రీమీగా కూడా ఉంటుంది.