ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఒక్క దోమ, పురుగు రాదు

Published : Aug 30, 2025, 07:08 PM IST

వానాకాలంలో సాయంత్రం అయితే చాలు ఇంట్లోకి దోమలు, పురుగులు వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లోకి దోమలు, పురుగులు రాకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
15
దోమలు

దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. అయితే వర్షాకాలంలో పురుగులు, దోమలు విపరీతంగా ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో. ఒక్కసారి ఇంట్లోకి వచ్చాయంటే ఇక బయటకు అస్సలు పోవు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే పురుగులను, దోమలను ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
కిటికీలను తెరవొద్దు

వానాకాలంలో పురుగులు, కీటకాలు, దోమలు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. ఇవి రావడానికి ఏ చిన్న స్థలం ఉన్నా సరే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవి మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలు, డోర్స్ ఎప్పడూ మూయండి. అలాగే ఏ గోడలకు ఏ చిన్న రంధ్రం ఉన్నా దోమలు వస్తాయి. కాబట్టి వెదర్ స్ట్రిప్స్, సిలికాన్ కౌల్స్ ను వాడండి. దోమలు వచ్చే గ్యాప్ ఎక్కడా లేకుండా చూడండి. దీనివల్ల ఇంట్లోకి దోమలు రావడం చాలా వరకు తగ్గుతుంది.

35
మెష్ స్క్రీన్‌

వెంటిటేర్లు, కిటికీలు, డోర్ల నుంచి దోమలు ఇంట్లోకి వస్తాయి. కాబట్టి వీటికి ఫైన్ మెష్ స్క్రీన్లను అమర్చండి. దీనివల్ల ఈగలు, దోమలు, కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది. వీటిని క్లీన్ చేయడం కూడా ఈజీనే. కాబట్టి స్లైడింగ్ స్క్రీన్ లను వాడండి.

సహజ వికర్షకాలు

కొన్ని మూలికలు, నూనెలతో కూడా ఇంట్లోకి దోమలు, పురుగులు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం మీరు యూకలిస్టస్, వేప, లెమన్ గ్రాస్ వంటి నూనెలను , మూలికలను వాడొచ్చు. ఇవి దోమలను, కీటకాలను అస్సలు ఇంట్లోకి రానీయవు. కాబట్టి మీరు ఈ నూనెలను ఇంటి చుట్టుమూట్టూ స్ప్రే చేయొచ్చు. లేదా కిటికీల దగ్గర వేప ఆకులను ఉంచొచ్చు. అలాగే సిట్రోనెల్లా క్యాండిల్స్ ను కాల్చొచ్చు.

45
తడి లేకుండా చూడండి

పురుగులు, దోమలు, కీటకాలు తడి, చీకలు, మురికి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో, ఇంటి చుట్టు ముట్టు మురికి, నీరు నిల్వ లేకుండా చేయండి. మీ ఇంట్లో పాత వార్తాపత్రకలు, చెక్క పెట్టెలు ఉంటే అక్కడ బొద్దింకలతో పాటుగా, చెదపురుగులు కూడా ఉంటాయి. కాబట్టి చెత్తను ఇంట్లో నుంచి తీసేయండి.

బగ్ ట్రాప్‌లు

కొన్ని చిట్కాలతో వీటిని ఇంట్లో లేకుండా చేయొచ్చు. ముఖ్యంగా ట్రాప్ లతో. అవును ఈగలు, బొద్దింకలను ట్రాప్ చేయడానికి మీరు చక్కెర నీళ్లను లేదా సబ్బునీటిని ఉపయోగించొచ్చు. ఇవి ఈ నీళ్లలో పడి చనిపోతాయి. లేదా మీరు కిటికీలు, లైట్ల దగ్గర అంటుకునే టేపును పెట్టండి. వీటికి ఎగిరేకీటకాలు పట్టుకుంటాయి.

55
కర్పూరం లేదా వెల్లుల్లి

వెల్లుల్లి, కర్పూరంతో కూడా మీరు దోమలు, ఈగలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. వీటి వాసన కీటకాలకు అస్సలు నచ్చదు. ఇందుకోసం కర్పూరం మాత్రలను అల్మారా, మీరు పడుకునే గదుల్లో, కిటికీల దగ్గర పెట్టండి. వెల్లుల్లి పేస్ట్ ను పెట్టినా రావు. వీటి ఘాటైన వాసన కీటకాలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది.

నీరు నిల్వ ఉండొద్దు

వానాకాలంలో ఎక్కువగా బాత్ రూం, సింక్ , బాల్కనీ దగ్గర నీరు నిల్వ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అక్కడ దోమలు, బొద్దింకలు తయారవుతాయి. వీటిని తరిమికొట్టేందుకు బేకింగ్ సోడా, వెనిగర్ బాగా సహాయపడతాయి. ఇందుకోసం మీరు బేకింగ్ సోడా, వెనిగర్ తో బాత్ రూం, బాల్కనీ, సింక్ ను క్లీన్ చేయండి. అలాగే ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories