రంగురంగుల సంక్రాంతి ముగ్గులు మీ కోసం..

First Published | Jan 4, 2024, 12:42 PM IST

సంక్రాంతి మరికొన్ని రోజుల్లో రానుంది. ఇక సంక్రాంతికి పిండివంటలు, తీపి పదార్థాలు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. అంతేకాదు రంగురంగుల సంక్రాంతి ముగ్గులు కూడా ఈ సంక్రాంతి స్పెషలే మరి. అందుకే ఆడవాళ్లు పండుగకు ముందే ఈ సంక్రాంతికి ఏ ముగ్గు వేయోలో ఈ పండుగను ముందే ప్రిపేర్ అవుతుంటారు. అందుకే మీకోసం కొన్ని సంక్రాంతి డిజైన్లను ఇప్పుడు చూద్దాం.. 
 

సాధారణంగా పండుగల సమయంలో మన ఇండ్లను అందంగా డెకరేట్ చేస్తాం. ముఖ్యంగా సంక్రాంతికి. మామిడి తోరణాలు కట్టడం, గోడలకు పెయింటింగ్ వేయడం వంటి పద్దతుల ద్వారా ఇంటిని అందంగా డెకరేట్ చేస్తాం. అయితే వీటన్నింటికి మించి వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తేనే సంక్రాంతి పండుగ పూర్తవుతుంది. మరి ఈ సంక్రాంతికి ఎలాంటి ముగ్గులు వేయాలో ఓ లుక్కేద్దాం పదండి. 

డాట్ టూ పాయింట్ ముగ్గు

ఈ అందమైన ముగ్గును వేయడం చాలా సులువు. నిజానికి ఈ ముగ్గును ఎవ్వరైనా సులభంగా వేయొచ్చు. ఈ సంక్రాంతికి మీరు ఈ రంగురంగుల ముగ్గును వేయాలనుకుంటే డిజైన్ ప్రకారం.. చుక్కలు పెట్టి ముగ్గును వేయండి. అలాగే వాటిలో రంగులను వేయండి. 
 

Latest Videos


సింపుల్ అండ్ మోడ్రన్ డిజైన్

ఈ ముగ్గు చూడటానికి సింపుల్ గా ఉంటుంది.  అలాగే అందంగా కూడా ఉంటుంది. అయితే ఈ ముగ్గు కాస్త మోడ్రన్ గా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే? మీకు నచ్చిన రంగును తీసుకుని పెయింటెడ్ రూపంలో వేసి..  ఆ తర్వాత వైట్ ముగ్గుతో అలంకరించండి. 
 

రోజ్ ఫ్లవర్ ముగ్గు

ఇందుకోసం మీరు ముందుగా కోలాన్ని బియ్యపు పిండితో డిజైన్ చేయండి. ఆ తర్వాత దీన్ని రంగులతో నింపండి. ముగ్గు పైన గులాబీలతో అందంగా అలంకరించండి. అంతే సింపుల్. ఈ ముగ్గు ఎంతో అందంగా కనిపిస్తుంది.
 

నెమలి డిజైన్

ఈ డిజైన్ చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అంతేకాదు దీన్ని వేయడం చాలా సింపుల్ కూడా. ఇందుకోసం మీరు ముందుగా నెమలి చిత్రాన్ని గీయండి. ఆ తర్వాత దీన్ని రంగులతో నింపండి. చివరగా వైట్ కలర్ తో దీన్ని అందంగా అలంకరించండి. 

గుండ్రని ముగ్గు

ఈ రకం రంగోలి ముగ్గును వేయడం చాలా సులభం. ఈ ముగ్గును వేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీని కోసం ముందుగా ఒక వృత్తాన్ని గీయండి. అందులో కలర్ ను నింపండి. ఆ తర్వాత దీనిలో అందమైన డిజైన్ ను గీయండి. 

click me!