sankranti 2023: సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ వెంటే..!

First Published Jan 14, 2023, 9:55 AM IST

sankranti 2023: భోగభాగ్యాలను తెచ్చే సంక్రాంతి రోజున కొన్ని పనులను చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి.. మీకు అన్నీ సంతోషాలే కలుగుతాయి. సిరి సంపదలు వెళ్లి విరుస్తాయని పండితులు చెబుతున్నారు. 

సంక్రాంతి  తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఎంతో ప్రత్యేకమైంది కూడా. ఈ పండుగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉద్యోగాలు, పనులకు వెళ్లినవారు కూడా తిరిగి ఇంటికి చేరుకుంటారు. పట్టణాల్లో సంగతి పక్కన పెడితే.. ఊర్లల్లో సంక్రాంతి పండుగ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. కొత్త అల్లుండ్లు, కోడి పందాలు, రంగు రంగుల ముగ్గులు, రతనాల గోబ్బిళ్లు, పిండి వంటలు, గాలి పటాల పోటీలు.. ఒక్కటేమిటీ.. ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
 

హిందువులకు మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలో సంచరిస్తాడు కాబట్టే మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. ఇంతటి ప్రత్యేకమైన రోజున ప్రజలు నిష్టగా ఉపవాసం ఉండి దేవుడిని పూజిస్తారు. అలాగే దాన ధర్మాలు చేస్తారు. ముఖ్యంగా నువ్వులను. 
 

ఈ ఏడాది 15 సంక్రాంతి పండుగను జరుపుకోబోతున్నాం. ఇక పోతే ఈ రోజున కొన్ని పనులను చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం కలుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అంతేకాదు సకల సంపదలు కూడా వెల్లివరుస్తాయట. మీ ఇళ్లు సంతోషంగా ఉంటుంట. ఇందుకోసం ఏం చేయాలంటే.. 

సంక్రాంతి రోజున దేవుడిని నిష్టగా పూజించాలి. అంటే మీరు ఇతర రోజుల్లో చేసే మాదిరిగా చేస్తే సరిపోతుంది. అయితే ఈ సంక్రాంతి రోజున నువ్వులను దానం చేస్తే అంతా మంచే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నువ్వులను. దీనివల్ల శనిదేవుడిని ప్రసనన్నం చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. 
 

సంక్రాంతికి దానధర్మాలు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ రోజున నదీ స్నానం చేస్తే కూడా ఎంతో మంచిదని పురాణాలు వెల్లడిస్తున్నాయి. నదీ స్నానం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది. నదీ స్నానం వీలుకాకపోతే నువ్వుల్ని నీటిలో వేసి స్నానం చేసినా మంచిదే. 
 

ఈ పండుగకు  ప్రకృతిని కూడా ఆరాధిస్తారు. పూజిస్తారు. అందుకే ఈ పండుగ రోజున తులసి మొక్కను లేదా ఇతర చెట్లను పూజించండి. అంటే వాటికి నీటిని సమర్పించండి. దీనివల్ల మీకు కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్యర్యాలు కలుగుతాయి. అంతేకాదు మీ ఇంట్లో సానుకూల శక్తి కూడా ఉంటుందని  పండితులు చెబుతున్నారు. 
 

ఈ రోజున మర్చిపోకుండా ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దల ఆశీర్వాదం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కష్టాల్లోంచి బయటపడేస్తుంది. 

ఇక ఈ పండుగకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. పెరుగు, బెల్లం, చివడ, నువ్వులు, అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు.
 

click me!