ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజులో ఒకటి రెండు సార్లు మోతాదులో అన్నం తినడం వల్ల ఎలాంటి సమస్య రాదు. కానీ మూడు పూటలా తినడమే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ మనలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రతిరోజూ అన్నం తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణ సమస్యలు
అన్నంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ కంటెంట్ మాత్రం ఉండదు. దీనివల్ల రాత్రిపూట అన్నం జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అంటే మీరు రాత్రిపూట అన్నాన్ని తింటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే రోజూ రాత్రిపూట అన్నం తినకూడదని చెప్తారు. ముఖ్యంగా హెవీగా అస్సలు తినకూడదు.