భారతదేశంలో పండుగలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మనదేశం అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు నెలవు. అందులో సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ. హిందూ సంస్కృతి ప్రకారం.. మకర సంక్రాంతి.. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. మకర సంక్రాంతి శీతాకాలం ముగింపు, సూర్యుడు ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు సుదీర్ఘ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కాలాన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు. ఇది చాలా పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు.
మకర సంక్రాంతి 2023: తేదీ, సమయం
మకర సంక్రాంతిని భోగి తర్వాత రోజు జరుపుకుంటారు. అంటే ఇది జనవరి 15, 2023 ఆదివారం నాడు వస్తుంది. సంక్రాంతి తిథి జనవరి 14 ఉదయం 8:57 గంటలకు ఉంటుందని పంచాంగం తెలుపుతోంది. మకర సంక్రాంతి పుణ్యకాలం ఉదయం 7:15 గంటల నుంచి మొదలవుతుంది. ఇది సాయంత్రం 5:46 గంటల వరకు ఉంటుంది. మకర సంక్రాంతి మహా పుణ్య కాలము ఉదయం 7:15 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9:00 గంటలకు ముగుస్తుంది.
మకర సంక్రాంతి 2023: భారతదేశమంతటా ఎలా జరుపుకుంటారు?
సంక్రాంతిని పంట పండుగ అని కూడా అంటారు. ఈ పండుగను సూర్యుభగవానుడికి అంకితం చేస్తారు. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించినందుకు గుర్తుగా ఈ పండుగకు మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఈ పండుగను భారతదేశమంతటా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు గొప్పగా జరుపుకుంటారు. అయితే మకర సంక్రాంతిని భారతదేశంలో ఒక్కో ప్లేస్ లో ఒక్కో విధంగా జరుపగుకుంటారు.
పంజాబ్, ఢిల్లీ, హర్యానాలలో ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు. ఈ రోజున.. సోదరులందరూ తమ పెళ్లైన అక్కా చెల్లెల్లకు వెచ్చని బట్టలు, స్వీట్లు తీసుకొస్తారు. ఇక పోతే పెళ్లైన స్త్రీలు తమ అత్తమామలకు శాలువాలు, స్వీట్లు, కొత్త బట్టలు, ఇతర వస్తువులను ఇచ్చి వారిమీదున్న ప్రేమను, గౌరవాన్ని చూపిస్తారు. ఈ పండుగను కుటుంబసభ్యులంతా ఒకేచోట జరుపుకుంటారు.
మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ పండుగ అంటారు. వరుసగా నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగకు ఒక్కో అర్థం ఉంటుంది. మొదటి రోజు ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుస్తారు. అలాగే ఇంటిని అందంగా పూలతో అలంకరిస్తాయి. ముఖ్యంగా భోగిరోజున వారి కొత్త, రంగురంగుల దుస్తులను ధరిస్తారు.
ఈ పండుగను గుజరాత్ లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు. మీకు తెలుసా ఈ రాష్ట్రం అంతర్జాతీయ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ కు ప్రసిద్ధి చెందింది. ఉదయం పూజలు ముగిసిన తర్వాత రంగురంగుల గాలిపటాలతో తమ ఇళ్లపై వాటిని ఎగరేస్తుంటారు. అయితే ఈ పోటీట్లో ఓడిపోయిన జట్టును ప్రజలు "కై పో చే" (Kai Po Che) అని అరుస్తారు. ఈ పండుగ సందర్భంగా నువ్వులు, వేరుశెనగలతో తయారు చేసే లడ్డూలు, చలికాలపు కూరగాయలతో తయారు చేసే ఉండియు వంటి వంటకాలను ఇష్టంగా తింటారు కూడా.
అస్సాంలో దీనిని బిహుగా జరుపుకుంటారు. అంతేకాదు అస్సామీ నూతన సంవత్సర ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది. ఈ రోజున ప్రజలు ధోతీ, గమోసా, సాదర్ మేఖేలా వంటి సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. అంతేకాదు సాంప్రదాయ జానపద పాటలు కూడా పాడతారు. అంతేకాదు వేడుక చేసుకోవడానికి నృత్యం కూడా చేస్తారు.
ఉత్తరాఖండ్ లో, మకర సంక్రాంతిని గుగుతి లేదా వలస పక్షులను స్వాగతించే పండుగ అని పిలుస్తారు. ప్రజలు ఖిచ్డీ, ఇతర ఆహార పదార్థాలను ఒకరికొకరు తినిపించుకుంటారు. అంతేకాదు విరాళ శిబిరాలను కూడా నిర్వహిస్తారు. పిండి, బెల్లంతో స్వీట్లను తయారుచేస్తారు. వీటిని వివిధ ఆకారాలలో డీప్ ఫ్రై చేస్తారు. ఈ స్వీట్లను పిల్లలు కాకులకు ఇస్తారు. అంతేకాదు కాకులకు పూరీలను ఇతర ఆహారాలను కూడా పెడతారు. కాకికి మొదట అన్నం పెట్టే పిల్లవాడు అదృష్టవంతుడని స్థానికులు నమ్ముతారు.
హిమాచల్ ప్రదేశ్ లో మాఘ సాజిని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. భారతదేశంలో సంక్రాంతిని సాజీ అని పిలుస్తారు. ప్రజలు ఈ ప్రాంతంలోని ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేస్తారు. దేవుడి ఆశీస్సులు పొందడానికి ఆలయాలను సందర్శిస్తారు. అంతేకాదు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి చిక్కీ, కిచిడీ, నెయ్యి వంటి స్వీట్లు అందజేస్తారు. ఇకపోతే ఈ పండుగ సందర్భంగా చాలా మంది స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు కూడా ఈ రోజున ఇస్తుంటారు. సాయంత్రం పూట జానపద పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ స్థానికులు సంబరాలు చేసుకుంటారు.