నేడు మనమంతా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు ఎన్నో విధాలుగా ప్రత్యేకమైంది. భారతదేశ చరిత్రలో 1950 జనవరి 26 సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందుకంటే ఈ రోజే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుకు చిహ్నంగా ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మన రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు పిలుస్తారంటే?
ఇరాన్ నుంచి వచ్చిన ఆక్రమణదారులు సింధు అనే పదాన్ని హిందువుగా ఉపయోగించారు. ఈ విధంగా భారతదేశానికి 'హిందుస్థాన్' అని పేరు పెట్టారు. ఈ పేరు సింధు, హిందూ కలయిక.
అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం
భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాగే ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద దేశం కూడా. ఇది పురాతన నాగరికతలలో ఒకటని చాలా మందికి తెలియదు.
రాజ్యాంగాన్ని ఎన్ని రోజుల్లో రూపొందించారు?
మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజుల సమయం పట్టింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు.
మన రాజ్యాంగం ఎన్నో దేశాల నుంచి ప్రేరణ పొందింది
భారత రాజ్యాంగం వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి ప్రేరణ పొందింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, ఐర్లాండ్ తో సహా ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి ఎన్నో విషయాలను గ్రహించారు.
పాము నిచ్చెన ఆట కనిపెట్టిన భారత్
మనమందరం చిన్నతనంలో పాము నిచ్చెన ఆట ఆడే ఉంటాం. కానీ ఈ ఆటను ఎక్కడ కనుగొన్నారో చాలా మందికి తెలియదు. అయితే ఈ గేమ్ ఇండియానే కనిపెట్టింది. దీనిని 13 వ శతాబ్దంలో కవి సాధువు జ్ఞాన్ దేవ్ తయారుచేశారు.