తన ఫ్రీ వెడ్డింగ్ పార్టీ మొదటిరోజు రాధిక నీలిరంగు(light blue) షేడ్స్‌తో కూడిన డ్రెస్... దానికి మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. ఆమె లోరైన్ స్క్వార్ట్జ్(Lorraine Schwartz) వజ్రాలతో రూపొందించిన అరుదైన నీలం రంగు ఒపల్ నెక్లెస్ వేసుకోవడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బ్లూ ఒపల్ రాధిక బర్త్ స్టోన్ (birthstone) అంటే బర్త్‌స్టోన్ అనేది ఒకరి పుట్టిన కాలాన్ని సూచించే రత్నం. అయితే వజ్రాలు అనంతాన్ని(infinity) సూచిస్తాయి. వీరి జీవితాల్లో ఐక్యతకి ప్రతీకగా ఈ నెక్లెస్ రూపొందించారు.
పార్టీలోని మరొక రోజు రాధిక మర్చంట్ అనంత్ అంబానీ ఇచ్చిన లవ్ లెటర్ ప్రింట్ చేసిన గౌను ధరించింది. తనకు 22 ఏళ్ల వయసులో అనంత్ అంబానీ ఈ లెటర్ ఇచ్చారని రాధిక పార్టీలో చెప్పారు. అనంత్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ ప్రేమలేఖ రాశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ జూలై 12న వివాహం చేసుకోనున్నారు. రాధికా మర్చంట్ మాట్లాడుతూ, "నా భవిష్యత్ తరాలకు ఇది కావాలి-నా పిల్లలు, మనవళ్లకు దీనిని చూపించి ఇది మా ప్రేమ అని చెప్పాలి" అని అన్నారు.
ఇన్విటేషన్ ప్రకారం పెళ్లితో పాటు మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది.