నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. పవన్ అభిమానులు రేణు దేశాయ్ ని సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతుంటారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ పిల్లల భాద్యత చూసుకుంటోంది. తరచుగా ఆమె అకిరా నందన్, ఆద్య గురించి విశేషాలని ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది.