సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి...
కారు గురించి పూర్తిగా కనుక్కోండి
మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి సిద్ధమైతే, ఆ కారు హిస్టరీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే కారు కొనే ముందు అది ఆక్సిడెంట్ కి గురైందో లేదో, ఎన్నిసార్లు సర్వీస్ చేశారు లేదా ఇంజిన్ ఎన్నిసార్లు రిపేర్ చేసారు అనేది తెలుసుకోవాలి. ఇవి తెలియకుండానే కారు కొంటే మళ్లీ మళ్లీ రిపేర్లు చేయాల్సి రావచ్చు.