మీరు సంవత్సరంలో 23 ఏకాదశులు ఎలాంటి పూజలు చేయకపోయినా.. ఈ నిర్జల ఏకాదశిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
మనకు ప్రతి సంవత్సరం దాదాపు 24 ఏకాదశులు వస్తాయి. కానీ.. అన్నింటి కంటే... ఈ నిర్ఝల ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకం. నిజానికి ఏకాదశి చాలా పవిత్రమై రోజు. ఈ రోజున ఏ మంచి పని అయినా మొదలుపెట్టవచ్చు. ఆ విష్ణుమూర్తిని పూజించవచ్చు. అయితే... మీరు సంవత్సరంలో 23 ఏకాదశులు ఎలాంటి పూజలు చేయకపోయినా.. ఈ నిర్జల ఏకాదశిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఈ నిర్జల ఏకాదశి కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మనం చేసే కొన్ని పనులు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. చాలా మంది... అదృష్టాన్ని నమ్మరు. మనం కష్టపడి పని చేస్తే..అనుకున్నది సాధిస్తాం.. దానికి అదృష్టంతో పని ఏమి ఉంది అనుకుంటారు. కానీ... మీరు మీరు 99శాతం కష్టపడినా.. ఒక శాతం అదృష్టం లేక.. బోల్తా పడిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఆ కూసంత అదృష్టం మన జీవితాన్నే మార్చేస్తుంది.
undefined
మరి.. ఈ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలో తెలుసా? మీరు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లవచ్చు. అంటే.. విష్ణుమూర్తి అవతరాలైన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి.. ఏ ఆలయానికి వెళ్లినా మంచిదే. ఆ ఆలయానికి వెళ్లే ముందు.. రెండు రకాల పూలను, ఓ తులసి ఆకులను కూడా తీసుకొని వెళ్లాలి. ఆ తర్వాత.. ఆ స్వామిని మీరు దర్శించుకుంటే సరిపోతుంది.
దీనికి తోడు.. ఓ నామాన్ని జపించడం వల్ల కూడా మీ బాధలు తీరతాయి. ‘ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ:’ ఈ నామాన్ని జపించాలి. దీనిని 108 సార్లు జపించండి. కచ్చితంగా ఆ విష్ణు మూర్తిని దర్శించుకోవడం వల్ల మీకు చాలా తక్కువ సమయంలో సత్ఫలితాలు లభిస్తాయి. ఇంతకీ ఈ నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు కదా... ఈ నెల అంటే..జూన్ 18వ తేదీ మంగళవారం నాడు వచ్చింది.