National Flag
ఈ ఏడాది మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26 ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే 1950 లో ఈ రోజు నాడే మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుకు చిహ్నంగా ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ సగర్వంగా భారత పతాకానికి సెల్యూట్ చేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల జెండా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
National Flag
1. త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల కారణంగానే జెండాను త్రివర్ణ పతాకమని అంటారు. జెండాలోని ప్రతి రంగుకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. కాషాయం బలం, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఇక తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు సంపద, పచ్చదనాన్ని సూచిస్తుంది.
National Flag
2. జెండాలో మధ్యలో ఉండే అశోక చక్రం చైతన్యానికి ప్రతీక. ఇది నీలం రంగులో ఉండటం వల్ల దీనిని ఆకాశం, నీటికి చిహ్నంగా భావిస్తారు.
3. అశోకుడి రాజధాని సారనాథ్ లోని సింహ స్తంభంపై ఈ చక్రాన్ని చెక్కారు. దీనిలో 24 ఆకులు ఉంటాయి.
4. త్రివర్ణ పతాకం వెడల్పు, పొడవు నిష్పత్తి 3:2. జెండాలోని మూడు రంగులు ఒకే సైజులో ఉంటాయి.
Indian National Flag
5. 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ పై జెండాను ఎగురవేశారు. అప్పుడు జెండా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నది.
6. ప్రస్తుతం మనం ఎగురవేస్తున్న జెండాను 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకం రూపంలో ఆమోదించింది.
7. మన త్రివర్ణ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 1921లో రూపొందించారు.
National Flag
8. త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ కూడా ఖాదీ, కాటన్ లేదా సిల్క్ తో తయారు చేస్తారు.
9. మన దేశ రాజ్యాంగంలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనే చట్టం అమలులో ఉంది. ఇది ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి వీలు కల్పిస్తుంది.
10. నడుము కింద.. త్రివర్ణ పతాకాన్ని వస్త్రంగా ధరించడం నిషిద్ధం.
11. త్రివర్ణ పతాకాన్ని చింపడం, మడతపెట్టడం, కాల్చడం, నేలపై విసిరేయడం కూడా నేరమే.