ఈ ఐదు ఇంటి పనులతో .. డిమెన్షియాకు చెక్ పెట్టొచ్చు...

First Published Sep 20, 2021, 1:02 PM IST

ఒక అధ్యయనం ప్రకారం, క్లీనింగ్, గార్డెనింగ్ వంటి సాధారణంగా రోజూ చేసే పనులు చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తాయి, క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల డిమెన్షియా రాకుండా అడ్డుకట్ట వేయచ్చు. కొన్ని రకాల ఇంటి పనులు చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందట.

డిమెన్షియా.. ఇది వృద్ధుల్లో దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య పరిస్థితి. యేటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధుల్లో ఇది బయటపడుతోంది. ఈ డిమెన్షియా లక్షణాల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచన చేయలేకపోవడం, సోషల్ ఎబిలిటీస్ ప్రభావితం కావడం ఉన్నాయి. దీనివల్ల వారి రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి, పెరగకుండా ఉండడానికి ఇప్పటివరకు ఎలాంటి చికిత్సలు, మందులు అందుబాటులో లేవు. 

dementia

అయితే, సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అలాంటిదే డిమెన్షియా రాకుండా ఉండడానికి ఒక దారి ఉంది. వయసులో ఉన్నప్పుడే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

Dementia

ఒక అధ్యయనం ప్రకారం, క్లీనింగ్, గార్డెనింగ్ వంటి సాధారణంగా రోజూ చేసే పనులు చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తాయి, క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల డిమెన్షియా రాకుండా అడ్డుకట్ట వేయచ్చు. కొన్ని రకాల ఇంటి పనులు చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందట. ఇది కఠినమైన శారీరక వ్యాయామం చేసే వారితో పోలిస్తే ఇంటి పనులు చేసేవారిలోనే చురుకుదనం ఎక్కువుంటుందట.  న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో చిత్తవైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉండే 5 ఇంటి పనులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

dementia

ఒక అధ్యయనం ప్రకారం, క్లీనింగ్, గార్డెనింగ్ వంటి సాధారణంగా రోజూ చేసే పనులు చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తాయి, క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల డిమెన్షియా రాకుండా అడ్డుకట్ట వేయచ్చు. కొన్ని రకాల ఇంటి పనులు చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందట. ఇది కఠినమైన శారీరక వ్యాయామం చేసే వారితో పోలిస్తే ఇంటి పనులు చేసేవారిలోనే చురుకుదనం ఎక్కువుంటుందట.  న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో చిత్తవైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉండే 5 ఇంటి పనులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

క్లీనింగ్ : ఇంటిని శుభ్రం చేయడానికి మీ మానసిక ఆరోగ్యానికి బలమైన లింక్ ఉంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం దానికోసం క్లీనింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, నిస్పృహ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్లీనింగ్ అనేది ధ్యానంతో సమానం. ఇది మెదడులో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి, నొప్పి అవగాహనను మార్చడానికి, సానుకూల అనుభూతిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఇది ఏకాగ్రతను, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

నీట్ గా సర్ధడం : గందరగోళంగా ఉన్న పరిసరాలు, ఇల్లు మిమ్మల్ని డిప్రెషన్ లక్షణాల్లోకి మరింత దిగజార్చవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ఇలాంటి వాతావరణం ఏకాగ్రతను తగ్గిస్తుంది. గందరగోళం, అలజడికి దారితీస్తుంది. అందుకే నీట్ గా పెట్టుకోవడం, సర్దడం, మడతలు పెట్టడం లాంటివాటి వల్ల మానసిక శాంతిని పొందొచ్చట. దీనివల్ల ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుందట. 

వంట చేయడం : వంట చేయడం అనేది ఏదో రోజువారీ పనిలో భాగం మాత్రమే కాదు. ఇది మెదడును ఉత్తేజపరిచే చర్య, ఇది మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పని మెదడు ముందు భాగాల్లో ఉండే లోబ్స్ ను బలపరుస్తుంది. వాటికి సంబంధించిన అన్ని రకాల పనులను మెరుగుపరుస్తుంది. మూలికలు, మసాలా దినుసుల గురించి తెలుసుకోవడం ఇంద్రియ తీక్షణతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇక చేసే వంట మీద శ్రద్ధ పెట్టడం అన్నింటికంటే ముఖ్యమైనది. దీనివల్ల  ఏకాగ్రతనుమెరుగుపరచడానికి, మెదడు పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి దోహదపడుతుంది.

తోటపని : ప్రకృతిలో సమయం గడపడం మీ మనస్సు, శరీరం, ఆత్మను చైతన్యంతో నింపడానికి సహాయపడుతుంది. తోటపని ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, మీ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఎండలో కొంత సమయం గడపడం వల్ల కూడా మీ మానసిక స్థితిని పెంచుతుంది. మీకు ప్రశాంతతను కలిగిస్తుంది.

ఇంటి పని ఎక్కువ చేయడం కూడా డిమెన్షియా రాకుండా అడ్డకుంటుంది. ఇల్లు తుడుచుకోవడం, వంట పాత్రలు కడగడం, బట్టలుతకడం వంటి ఇంటి పనులు కూడా మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.  ఈ పనులు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. సంతృప్తిని ఇస్తాయి. అలాగని వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న వాళ్లు ఇంటిపనిని మరీ ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిది. 

click me!