బొప్పాయితో ఇలా చేస్తే.. అందం పెరుగుతుంది..

First Published Nov 8, 2022, 1:59 PM IST

బొప్పాయిలో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలను, వృద్ధాప్య సంకేతాలను, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. 
 

papaya

బొప్పాయి పండు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పండు చర్మానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో పునరుత్పత్తి ఎంజైమ్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బొప్పాయి చర్మం పగుళ్లను నివారిస్తుంది. డ్రై నెస్ ను తగ్గిస్తుంది. అలాగే ఓపెన్ రంధ్రాలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ చర్మం అందంగా ఉండటానికి బొప్పాయి జ్యూస్ ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. దీనివల్ల  మీ చర్మం ఎంతో అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. 
 

బొప్పాయిలో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ముఖంపై ఉండే ముడతలను, వంటి వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడే యాంటీ ఏజింగ్ మాస్క్ గా దీనిని ఉపయోగించొచ్చు. దీనిలో విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తాయి. అరకప్పు పండిన బొప్పాయిని గుజ్జుగా చేసి.. అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు, తేనెను కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయండి. ఆ తర్వాత ముఖాన్ని, మెడను నెమ్మదిగా మసాజ్ చేయండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి.
 

బొప్పాయి మచ్చలు, కాలిన గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే పపైన్ అని పిలువబడే ఎంజైమ్ చనిపోయిన చర్మ కణాలను బయటకు పంపుతుంది. చర్మంలోని మలినాలను శుద్ధి చేస్తుంది. తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను నయం చేస్తుంది. అలాగే దురదను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

బొప్పాయిలో ఉండే ఔషద గుణాలు మచ్చలను తగ్గించడానికి, పిగ్మెంటేషన్ ను తొలగించడానికి సహాయపడతాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ మృతకణాలను తొలగిస్తుంది.అంతేకాదు ఇది మీ ముఖాన్ని మరింత మృదువుగా, అందంగా చేస్తుంది చేస్తుంది.
 

బొప్పాయిలో  లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యం లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. 2017లో జరిపిన అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.

click me!