National Youth Day 2024
National Youth Day 2024: జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి ఏడాది జనవరి 12న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే మనం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని 1985 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
National Youth Day 2024
స్వామి వివేకానంద ఆదర్శాలు, ఆలోచనలు ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయి. అందుకే స్వామి వివేకానంద ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. స్వామి వివేకానందా చాలా చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అందుకే ఆయన లేకపోయినా.. ఆయన ఆలోచనలతో నేటికీ బతికే ఉన్నారు. ఆయన ఆలోచనలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ రోజును యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. దేశానికి యువత ఒక ముఖ్యమైన భాగం. మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి యువత కీలక పాత్ర పోషిస్తుంది.
International youth day 2023: Exploring essence, significance of theme
ఈ రోజు ఎలా ప్రారంభమైంది?
1948ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన సంవత్సరంగా ప్రకటించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం 1984 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 12న అంటే స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. మొదటి నేషనల్ యూత్ డే 1985 జనవరి 12న జరుపుకున్నారు.
2024 జాతీయ యువజన దినోత్సవం థీమ్
ఈ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం థీమ్.. 'లేవండి, మేల్కొనండి, మీరు కలిగి ఉన్న శక్తిని గ్రహించండి. (“Arise, Awake, and Realise the Power You Hold.”) ఇవే మీరు చేయాలనుకున్న పనిని పూర్తి చేసేలా చేస్తాయి. మీలో ఉన్న శక్తిని కనుగొన్నప్పుడే మీరు విజయం సాధిస్తారు.
జాతీయ యువజన దినోత్సవం
ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. ముందే మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. అందుకే దేశంలోని యువతకు సరైన మార్గనిర్దేశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వివేకానందుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆలోచనలతో యువతలో స్ఫూర్తి నింపడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?
ఈ యువజన దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. స్వామి వివేకానంద గురించి, ఆయన విలువలు, ఆలోచనల గురించి పిల్లలకు చెప్తారు.