నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

First Published Nov 8, 2021, 8:47 PM IST

నల్గొండ జిల్లాని నీలగిరి అని కూడా అంటారు. నల్గొండని శాతవాహనుల కాలంలో నీలగిరి (Nilagiri) అని పిలిచేవారు. నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నల్గొండ జిల్లాలో అనేక నదులు చారిత్రక కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఆర్టికల్ (Article) ద్వారా నల్గొండ జిల్లాలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

నల్గొండ జిల్లాలో కృష్ణా నదీ, ఆలేరు, పెద్దవాగు,  మూసీ నదులు ప్రవహిస్తున్నాయి. నల్గొండ జిల్లా సిమెంట్ ఉత్పత్తిలో ఆసియాలోని (Asia) ప్రథమ స్థానంలో ఉంది. నల్గొండ అంటే బ్లాక్ హిల్స్ (Black hills) అని అర్థం. నల్గొండ జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖ్యమైన దర్శనీయ పుణ్యక్షేత్రం. నల్గొండలో చూడవలసిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

యాదగిరి గుట్ట: నల్గొండ (Nalgonda) జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదగిరిగుట్ట పట్టణంలో ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ముఖ్యమైనది యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయం (Temple) ప్రముఖమైనది. ఇక్కడి నరసింహ స్వామిని యాదగిరి అని కూడా పిలుస్తారు.
 

సురేంద్రపురిలో గల పౌరాణిక మ్యూజియం
కుందా సత్యనారాయణ కళాధామం: ఇది యాదగిరిగుట్ట (Yadagirigutta) సమీపంలో ఉంది. ఒక హిందూ ధర్మ శిల్పకళా క్షేత్రం. బ్రహ్మలోకం, కైలాసం విష్ణులోకం, స్వర్గలోకం, నరకలోకం పద్మ లోకాలను దృశ్యరూపంలో (Visualization) చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

మహాభారతం, భాగవతం వంటి పురాణ ఇతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటాయి.ఈ కళాధామం (Art gallery) దర్శించుటకు రెండు గంటల సమయం పడుతుంది. అమ్మ వారి వాహనం సింహం నోటి నుండి కల ధర్మానికి ప్రవేశ (Entrance) మార్గం ఏర్పాటు ఉంటుంది. ఒకే ప్రదేశంలో సకల దేవతల దర్శనభాగ్యం కలుగుట ఇక్కడి విశేషత.

నందికొండ: నందికొండ (Nandikonda) ఒక చిన్న గ్రామం. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. నాగార్జునసాగర్ నందికొండగా పిలుస్తున్నారు. ఆస్తిపన్ను వసూలు చేయని పురపాలక సంఘంగా ఉంది. నందికొండ నాగార్జున సాగర్ డ్యామ్ (Nagarjuna sagar) వద్ద కృష్ణా నది ఒడ్డున ఉంది.

నాగార్జునసాగర్ డ్యాం: నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపన (Concreting) జరిగి 65 ఏళ్లు పూర్తి చేసుకుంది.1955 డిసెంబర్ లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ప్రాజెక్టు (Project) పనులు 12 ఏళ్ల పాటు కొనసాగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని రెండు లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది.

విద్యుత్ (Electricity) ను కూడా అందిస్తోంది. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలు ఏర్పాటు చేశారు. కుడికాలువకు జవహర్ కెనాల్ (Jawahar kenal), ఎడమ కాలువకు లాల్ బహుదూర్ (Lal bahudhur) అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాతి ఆనకట్ట. హరిత విప్లవంలో ఒక భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన మొదటి నీటిపారుదల ప్రాజెక్టు ఇది.

click me!