ఢిల్లీలో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published Nov 7, 2021, 2:43 PM IST

భారతదేశపు (India) రాజధాని అయిన కొత్త ఢిల్లీలో అనేక చారిత్రక కట్టడాలు, శిల్ప కళలు, సాంస్కృతిక కార్యకలాపాలు ఎన్నో పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ఆర్టికల్  (Article) ద్వారా ఢిల్లీలో ఉన్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
 

అక్షరధామ్ (Akshardhamm): వంద ఎకరాల సువిశాల భూభాగంలో ఏర్పడిన ఆలయం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వేదిక. 141 అడుగుల ఎత్తు ఉన్న నిర్మాణం. 316 అడుగుల వెడల్పుతో 370 అడుగుల నిడివితో చూపరులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇది ఎర్రటి ఇసుక రాళ్లతో (Brick stones) నిర్మించబడింది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ మూర్తి (Narayana moorthy) ఉన్నారు. ఈ ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది.
 

ఇండియా గేట్ (India gate): మొదటి ప్రపంచ యుద్ధంలో ఆఫ్గాన్ యుద్ధంలో అమరులైన 90వేల యుద్ధ జవాన్ ల స్మారకార్ధం నిర్మించిన అపురూప కట్టడం. దీని ఎత్తు సుమారు 42 మీటర్లు ఉంటుంది. ఈ కట్టడానికి భరత్ పూర్ (Bharath pur) ఎర్ర రాయిని ఉపయోగించారు. 1971 నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాలలో చూడముచ్చటగా ఉన్న పచ్చిక బయళ్లు, చిన్నారులు ఆడుకోవడానికి బోట్ క్లబ్ లు ఎన్నో ఉన్నాయి. దీనిని అప్పటి ప్రధాని అయినా ఇందిరాగాంధీ (Indira Gandhi) ప్రారంభించారు.
 

ఎర్రకోట: ఈ కోట యమునా నదిని (Yamuna river) ఆనుకొని ఉంది. ఈ కోటలో ప్రదర్శించబడిన కళా రూపము ఐరోపా, పర్షియా, భారత దేశాలకు చెందిన కళల యొక్క సంయోగము. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట (Red Fort) భారతదేశంలో ఉన్న ముఖ్యమైన భవన సముదాయాలలో ఒకటి. 1917 ఆగస్టు 15న భారత స్వతంత్ర దేశంగా మారింది. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పతకాన్ని ఎగురవేస్తారు. ఈ పద్ధతి ఈనాటికీ కొనసాగుతోంది. భారత ప్రధాన మంత్రి ఈ కోటలోని లాహోర్ గేట్ ప్రాంగణం నుండి ప్రతి ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజున భారత పతాకాన్ని ఎగురవేస్తారు.
 

లోటస్ టెంపుల్ (Lotus temple): మన భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో (Delhi) లోటస్ టెంపుల్ ఉంది. ఈ గుడిని పాలరాతితో నిర్మించారు. ఇది ఒక బహాయి ప్రార్థన మందిరం. 1986లో ఈ మందిరం పూర్తయింది. ఈ మందిరం ఒక పుష్పం వంటి ఆకారంలో గుర్తింపు పొందింది. ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ (Mother temple) గా సేవలందిస్తోంది. ఇది ఢిల్లీలోని ప్రముఖ ఆకర్షణ ప్రదేశాలలో ఒకటి. దీని నిర్మాణానికి అనేక అవార్డులు వచ్చాయి. ఈ లోటస్ మందిరం చీకటి పడిన తరువాత లైట్లతో ప్రకాశిస్తూ ఆకర్షిస్తుంది.
 

బిర్లా మందిరం (Birla Mandir): ఇది ఢిల్లీ (Delhi) లో నిర్మించబడిన ఒక హిందూ దేవాలయం. ఈ మందిరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఈ గుడికి ఎడమవైపు దుర్గాదేవి, కుడివైపు శివుడు ధ్యాన సముద్రంలో (Sea) కనిపిస్తారు. ముఖద్వారానికి కుడివైపున వినాయకుడు, ఎడమవైపున రామ భక్త హనుమాన్ స్థాపించబడ్డాయి. దేవాలయాలు మొత్తం విస్తీర్ణం ఇంచుమించు 7.5 ఎకరాలు ఉంటుంది.

click me!