ఎండాకాలంలో తాటి ముంజలను ఎందుకు తింటరో తెలుసా?

First Published | May 16, 2024, 10:05 AM IST

తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. నిజానికి ఎండకాలంలో తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 
 

ఎండాకాలంలో మార్కెట్ లో రకరకాల పండ్లు దొరుకుతాయి. వీటిలో తాటి ముంజలు ఒకటి. నిజానికి తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఈ కాలంలో బాగా తింటుంటారు. ఈ పండ్లు తాటి చెట్లకు కాస్తాయి. ఈ పండ్లను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. దీని ఆకారం.. చూడటానికి స్నోబాల్ లాగా కనిపిస్తుంది. కానీ దీని రుచి అద్బుతంగా ఉంటుంది. ఎండాకాలంలో దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 
 

ఎండాకాలంలో తాటి ముంజలను తినడం వల్ల కలిగే  ప్రయోజనాలు

ఎండాకాలంలో చెమట విపరీతంగా పట్టడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ డీహైడ్రేషన్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు తాటి ముంజలను తినొచ్చు. తాటి ముంజలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.
 


తాటి ముంజల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీరు డీహైడ్రేషన్ సమస్య బారిన పడే ప్రమాదం ఉండదు. అలాగే వీటిలో  మీకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. ఇది మీ శరీరంలో ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. 
 

అంతేకాదు తాటి ముంజలను తినడం వల్ల మీ కడుపునకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండాకాలంలో జీర్ణ సమస్యలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తాటి ముంజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో నీటి కంటెంట్ కూడా ఉంటుంది. ఫైబర్, వాటర్ ఉండటం వల్ల పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని తింటే మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అతిగా పండిన తాటి ముంజలను తింటే మాత్రం కడుపు నొప్పి వస్తుంది జాగ్రత్త. 
 

Latest Videos

click me!