విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా?  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లేటెస్ట్ లుక్!

Published : May 16, 2024, 08:24 AM IST

విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. అతని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్న సూర్య సేతుపతి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ మీకోసం...   

PREV
17
విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా?  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లేటెస్ట్ లుక్!
Vijay Sethupathi son Surya Sethupathi


దేశం మెచ్చిన నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి హీరో స్థాయికి ఎదిగాడు. విలక్షణ నటుడిగా విభిన్నమైన పాత్రలు చేస్తూ అత్యంత డిమాండ్ ఉన్న నటుడు అయ్యాడు. విజయ్ సేతుపతికి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. 
 

27
Vijay Sethupathi son Surya Sethupathi

2003లో విజయ్ సేతుపతి జెస్సీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయి పేరు సూర్య కాగా... హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. 

37
Vijay Sethupathi son Surya Sethupathi

సూర్య సేతుపతి కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది. విజయ్ సేతుపతి హిట్ చిత్రాల్లో ఒకటైన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో సూర్య సేతుపతి చిన్న పాత్ర చేశాడు. నయనతార హీరోయిన్ గా దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీలో సూర్యది చాలా చిన్న పాత్ర. 

 

47
Vijay Sethupathi son Surya Sethupathi

అయితే సింధుబాద్ మూవీలో సూర్య ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. ఈ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. బాల్యంలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు సూర్య. కొంచెం గ్యాప్ ఇచ్చి హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. 

57
Vijay Sethupathi son Surya Sethupathi


గత ఏడాది సూర్య డెబ్యూ మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది. మూవీ టైటిల్ ఫీనిక్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. స్టంట్ మాస్టర్ ఏఎన్ఎల్ అరసు ఈ చిత్ర దర్శకుడు. ఫీనిక్స్ టైటిల్ లోగో ఆకట్టుకుంది. 
 

67
Vijay Sethupathi son Surya Sethupathi

ఫీనిక్స్ చిత్రాన్ని బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ లో రాజలక్ష్మి అరసు కుమార్ నిర్మిస్తున్నారు. 2023 నవంబర్ 24 నుండి షూటింగ్ జరుపుకుంటుంది. ఇక హీరోగా సూర్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

77
Vijay Sethupathi son Surya Sethupathi

ఇక సూర్య లేటెస్ట్ ఫోటోలు చూసిన జనాలు విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కుమారుడు ఉన్నాడా? అని ఆశ్చర్యపోతున్నారు. ఫీనిక్స్ మంచి విజయం సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సేతుపతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories