Sunil Chhetri Retirement: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రి గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
Sunil Chhetri Retirement: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రి గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కువైట్‌తో జరిగే FIFA వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. జాతీయ జట్టు కెప్టెన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఛెత్రి భారతదేశం తరపున 145 మ్యాచ్‌లు ఆడాడు. తన 20 ఏళ్ల కెరీర్‌లో 93 గోల్స్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన టాప్-5 స్కోరర్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు సునీల్ ఛెత్రి.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇలా ప్రకటించారు. ’నేను ఎప్పటికీ మరచిపోలేని రోజు . నేను నా దేశం కోసం ఆడిన మొదటి సారి. ఇది అపురూపమైనది.ఆ రోజు ఉదయం, నా మొదటి జాతీయ జట్టు కోచ్ సుఖి సర్ నా దగ్గరకు వచ్చి - నువ్వు సిద్దమా? ప్రశ్నించారు. నాకు ఎలా అనిపించిందో చెప్పలేను. నేను నా జెర్సీ తీసుకున్నాను. దాని మీద కాస్త పెర్ఫ్యూమ్ స్ప్రే చేసాడు... ఎందుకో తెలియదు. నా అరంగేట్రంలో మ్యాచ్ లో 80వ నిమిషంలో గోల్ చేయడం. నేను ఎప్పటికీ మరచిపోలేని రోజు. జాతీయ జట్టు పర్యటనలో నా అత్యుత్తమ రోజులలో ఒకటి’ గత 19 ఏళ్లలో నేను కర్తవ్య ఒత్తిడికి, అపారమైన ఆనందానికి లోనయ్యాను’ అని తెలిపారు.
I'd like to say something... pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11)
తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో
సునీల్ ఛెత్రి 12 జూన్ 2005న అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లోనే తన తొలి అంతర్జాతీయ గోల్‌ను కూడా సాధించాడు. ఛెత్రీ తన అద్భుతమైన కెరీర్‌లో ఆరు సందర్భాలలో AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇది కాకుండా.. కేంద్రప్రభుత్వం 2011 లో అర్జున అవార్డు, 2019 లో పద్మశ్రీతో సునీల్ ఛెత్రీని సత్కరించింది.
FIFA ప్రపంచ కప్ 2026, AFC ఆసియా కప్ 2027 కోసం కువైట్ - ఖతార్‌లతో జరిగే ప్రిలిమినరీ జాయింట్ క్వాలిఫికేషన్ రెండవ దశ మ్యాచ్‌ల కోసం టీమ్ ఇండియా ఇటీవలే ప్రకటించబడింది. జూన్ 6న కోల్‌కతాలో కువైట్‌తో గ్రూప్-ఎలో చివరి రెండు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు జూన్ 11న దోహాలో ఖతార్‌తో తలపడనుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగు పాయింట్లతో గ్రూప్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లలో మూడవ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. AFC ఆసియా కప్ సౌదీ అరేబియా 2027లో తమ స్థానాన్ని బుక్ చేసుకుంటాయి.