మన దేశంలో అద్భుతమైన 10 రైలు ప్రయాణాలు ఇవే..! లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..

First Published Jun 27, 2022, 11:05 AM IST

ట్రైన్ లో ఓ కిటికీ పక్కన కూర్చునప్పుడు.. కిటికీలోంచి వచ్చే చల్లని పిల్లగాలి శరీరాన్ని తాకుతుంటే వచ్చే ఆ ఆనందం అలాంటి సమయాలను ఎన్ని డబ్బులిచ్చినా కొలనేము కదా.. అందుకే అప్పుడప్పుడూ ట్రైన్ జర్నీ చేస్తూ ఉండాలి. మన దేశంలో అందరికీ నచ్చే పది అద్భుతమైన రైళు ప్రయాణాలున్నాయి. అవి మీకు బాగా నచ్చుతాయి కూడా.. 

ట్రైన్ జర్నీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇలాంటి వాళ్లు బస్సులకు బదులుగా ట్రైన్ లోనే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే మామూలు పనుల కోసం కాకుండా..దేశాన్ని చుట్టి రావడానికి కూడా ఎన్నో రైళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మన ధేశంలో మీరు విహార యాత్రకు వెల్లడానికి.. అద్భుతమైన రైలు ప్రయాణాలు ఉన్నాయి. వీటిలో ప్రయాణిస్తూ.. మన దేశంలో ఉన్న అందాన్నంతా చూసెయొచ్చు. ఈ రైలు మార్గాలు ఐకానిక్ నుంచి చారిత్రాత్మకమైనవి కూడా ఉన్నాయి. మీకు ఎలాంటివి నచ్చితే అలాంటి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. హిమాలయాలలోని లోయ, పర్వతాల నుంచి పశ్చిమ కనుమల పచ్చని అడవి నుంచి సముద్ర వంతెనల వరకు.. భారతీయ రైల్వేలు మీ కోసం వేచిచూస్తున్నాయి. మన దేశంలో అద్భుతమైన 10 రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. . 
 

Himalayan Queen: కల్కా-సిమ్లా

కల్కా నుంచి సిమ్లాకు బొమ్మ రైలులో ప్రయాణించకుండా మీరు సిమ్లాను దాటలేరు. ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఐకానిక్, చారిత్రాత్మక హిమాలయ క్వీన్ రైలు ప్రయాణం సిమ్లా చుట్టూ ఉన్న అందమైన లోయ దృశ్యాలు, పచ్చిక బయళ్ల గుండా మిమ్మల్ని తీసుకువెళుతుంది. ఇది పూర్తిగా ప్రామాణికమైన కొండ అనుభవం. దీనిని మీరు భారతదేశంలో మరెక్కడా చూడలేరు. ఈ ప్రయాణం మొత్తం 96 కిలోమీటర్ల  upslope, 102 సొరంగాలు, 82 వంతెనల గుండా మిమ్మల్ని తీసుకువెళుతుంది.

TRAIN

డార్జిలింగ్ హిమాలయ రైల్వే:  New Jalpaiguri to Darjeeling

రైలు ప్రయాణాల్లో డార్జిలింగ్ హిల్ స్టేషన్ ను తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. 78 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రయాణం సిలిగురి టౌన్, సిలిగురి జంక్షన్, సుక్నా, రంగ్తోంగ్, టిండారియా, మహానది, కుర్సియోంగ్, తుంగ్, సొనాడా, ఘుమ్, రోంగ్బుల్, జోరెబంగ్లో, బటాసియా లూప్ గుండా వెళుతుంది. డార్జిలింగ్ టాయ్ ట్రైన్ గురించి మీరు చాలానే వినే ఉంటారు. కొండను చూడటానికి ఉత్తమమైన రైళ్లు ప్రయాణాల్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. 

మహారాజా ఎక్స్ ప్రెస్: ఢిల్లీ టూ ముంబై

విలాసవంతమైన మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఐదు వేర్వేరు రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా మిమ్మల్ని తీసుకువెళుతుంది. ఈ రైలు ప్రయాణాన్ని విహారయాత్రనే చెప్పాలి.  6 నైట్స్/7 డేస్ జర్నీలో ఢిల్లీ, ఆగ్రా, రణతంబోర్, జైపూర్, బికనీర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్, ముంబై వంటి ప్లేసెస్ లో మీకు బస, ఆహారం వంటి ఫెసిలిటీస్ ఉంటాయి. 

TRAIN

మండోవి ఎక్స్ ప్రెస్: ముంబై-గోవా

మీరు సహ్యాద్రి కొండ శ్రేణులను చూడాలనుకున్నట్టైతే.. మీకు ఇదే బెస్ట్ ట్రైన్ జెర్నీ.. ముంబై నుంచి గోవాకు మండోవి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించండి. ఈ రైలు ప్రయాణం సహ్యాద్రి అద్భుతమైన Gorges ను, అరేబియా సముద్రం యొక్క అందమైన దృశ్యాలను చూపిస్తుంది. మండోవి ఎక్స్ ప్రెస్ కొంకణ్ రైల్వేలో భాగంగా ఉంది.
 

Vasco da Gama route: Hubli-Madgaon

గోవా లింక్ ఎక్స్ ప్రెస్, లేదా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తే.. మీ జీవితంలో ఈ ట్రైన్ జర్నే థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది. ఎందుకంటే హుబ్లీ-మడ్గావ్ మార్గంలో అందమైన దూద్సాగర్ జలపాతాలను చూస్తారు. ఇందుకోసం మీరు లోండా జంక్షన్ వద్ద దిగండి. ఇది దూద్ సాగర్ జలపాతానికి సమీపంలోనే స్టేషన్ ఉంటుంది.
 

డెక్కన్ ఒడిస్సీ: ముంబై - ఢిల్లీ

విలాసవంతమైన డెక్కన్ ఒడిస్సీని చూడటానికి రెండు కళ్లూ చాలవేమో. మహారాష్ట్ర, గోవాలో ఎన్నో అందమైన ప్రదేశాలుంటాయి.  దక్కన్ ఒడిస్సీ ముంబై నుంచి ప్రారంభమై సింధుదుర్గ్, గోవా, గోవా- వాస్కో, కొల్హాపూర్, ఔరంగాబాద్, నాసిక్, చివరకు ఢిల్లీ గుండా వెళుతుంది. రైలులో టాప్-నాచ్ ఆయుర్వేద స్పా, ఆవిరి స్నానాలు వంటి స్పెషల్స్ గా ఉంటాయి. 
 

TRAIN

సేతు ఎక్స్ప్రెస్: చెన్నై టూ రామేశ్వరం

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన రామేశ్వరాన్ని సందర్శించడానికి సేతు ఎక్స్ప్రెస్ ఎక్కండి. తమిళనాడులోని చెన్నై నుంచి పంబన్ ద్వీపంలోని రామేశ్వరం వరకు, చెన్నై ప్రధాన భూభాగం గుండా, పాక్ జలసంధి మీదుగా మిమ్మల్ని ఈ రైలు మిమ్మల్ని తీసుకువెళుతుంది. సముద్రంపై ఉన్న పంబన్ రైల్వే బ్రిడ్జి ఒక అద్భుతమైన అనుభవం. ఇది 1988లో నిర్మించిన ఒక రోడ్డు వంతెనకు సమాంతరంగా నడుస్తుంది. అంతకు ముందు పంబన్ ద్వీపానికి చేరుకోవడానికి సముద్ర వంతెన మాత్రమే మార్గంగా ఉండేది.

కాశ్మీర్ రైల్వే: జమ్మూ నుంచి ఉధంపూర్ వరకు

జమ్ముకశ్మీర్ అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవేమో అన్నంత అందంగా ఉంటుంది. జమ్మూ నుంచి ఉధంపూర్ వరకు విస్తరించి  ప్రాంతం మిమ్మల్ని అందమైన శివాలిక్ పర్వత శ్రేణుల వెంట తీసుకువెళుతుంది. ఇది కాశ్మీర్ లోయ అందాలను, ఉత్తమ దృశ్యాలను చూపిస్తుంది. ఈ మార్గంలో మీరు 20 సొరంగాలు, 158 వంతెనలు, కొన్ని అత్యంత అందమైన నదులను దాటుతారు.
 

ఐలాండ్ ఎక్స్ప్రెస్: కన్యాకుమారి టూ త్రివేండ్రం

ఐలాండ్ ఎక్స్ ప్రెస్ కన్యాకుమారి నుంచి తిరువనంతపురం వరకు రెండు గంటల రైలు ప్రయాణం. రైలు ప్రయాణం ఈ రైలు ప్రయాణం మీకు మంచి అనుభవంగా ఎన్నటికీ గుర్తుండిపోతుంది. పుస్తకంలోని ఒక సన్నివేశంలానే అనిపిస్తుందంటే నమ్మండి.  ఈ రైలు దట్టమైన అటవీ ప్రాంతాలు, తాటి చెట్ల వెంబడి చక్కర్లు కొడుతుంది. మీ చుట్టూ పరిచినట్టుగా ఉన్న పచ్చదనాన్ని చూస్తారు. మొత్తంగా ఈ ట్రైన్ జర్నీ..ఒక పుస్తకంలోని అందమైన కథలాగే ఉంటుంది. 

గోల్డెన్ ఛారియట్: బెంగళూరు టూ గోవా

ఈ లగ్జరీ రైలు మిమ్మల్ని దక్షిణ భారతదేశంలోని కొన్ని ఉత్తమ దృశ్యాల గుండా తీసుకెళుతుంది. గోల్డెన్ రథం మీద అడవి కబిని వన్యప్రాణి అభయారణ్యం, హంపి, బాదామి యొక్క వారసత్వ ప్రదేశాలు, ఇసుకరాయి గుహల అందమైన దృశ్యాలు, ఆలయ శిథిలాల నుంచి చివరికి గోవా అడవి అందమైన దృశ్యాలను చూస్తారు. గోల్డెన్ రథం మీకు మర్చిపోలేని అనుభూతులనిస్తుంది. 

click me!