హెన్నాలో ఈ మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్.. నల్లటి నిగనిగలాడే జుట్టు మీ సొంతం...

First Published Nov 1, 2021, 2:39 PM IST

హెన్నాలో కూడా ఇప్పుడు రకరకాలు దొరుకుతున్నాయి. అయితే హెన్నా అని పేరుంటే ఏది పడితే అది కాకుండా.. దాని క్వాలిటీ చెక్ చేసుకోవడం ముఖ్యం.. ఆ తరువాత హెన్నా ఇచ్చే సహజమైన blackకంటే ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే.. కొన్ని రకాల పదార్థాలు మీ హెన్నాకి జోడించాలి.

నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడడం మామూలుగా మారిపోయింది. ముప్పైల్లోకి వచ్చేసరికి తెల్ల జుట్టు హాయ్ అంటూ పలకరిస్తుంది. దీనికోసం రకరకాల హోం రెమిడీస్, హెన్నాలు, హెయిర్ కలర్స్ ని ఆశ్రయిస్తుంటారు.

చాలాసార్లు హెన్నా పెట్టుకుంటే జుట్టు మొత్తం ఎర్రగా మారుతుంది. అంతేకానీ మీకు కావాల్సిన నలుపు రంగు మాత్రం రాదు. దీనికోసం హెన్నాలో మందార ఆకులు, డికాషన్ లాంటివి కలిపినా ఫలితం ఉండదు. అందుకే ఎక్కువ తెల్లబడిన జుట్టుు హెన్నా రాసుకుంటే బ్రౌనిష్ లోనే కనిపిస్తుంది. 

hennaతో ఇలా జరుగుతుందని రసాయన హెయిర్ కలర్స్ కి మారుతుంటారు. అయితే ఇదేమాత్రంం కరెక్ట్ కాదంటున్నారు. సహజసిద్ధమైన హెన్నాతో కూడా నలుపు రంగు తీసుకురావచ్చని.. మీ జుట్టుకు ఇదే మంచిదని చెబుతున్నారు. దానికోసం ఏం చేయాలో కూడా నిపుణులు సూచిస్తున్నారు. 

హెన్నాలో కూడా ఇప్పుడు రకరకాలు దొరుకుతున్నాయి. అయితే హెన్నా అని పేరుంటే ఏది పడితే అది కాకుండా.. దాని క్వాలిటీ చెక్ చేసుకోవడం ముఖ్యం.. ఆ తరువాత హెన్నా ఇచ్చే సహజమైన blackకంటే ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే.. కొన్ని రకాల పదార్థాలు మీ హెన్నాకి జోడించాలి. 

మీ హెన్నాలో బ్లాక్ టీ, గుడ్డులోని పచ్చసొన, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత దీనికి ఒక టీ స్పూన్ ఫుల్ కాఫీ పౌడర్, ఒక టీ స్పూన్ ఫుల్ ఆమ్లా పౌడర్ వేసి కలపాలి. దీంతో మీకు కావాల్సిన నలుపురంగునిచ్చే హెన్నా రెడీ అయిపోయినట్టే

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయం జుట్టుకు మొత్తం అంటేలా పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకున్న తరువాత రెండు గంటల పాటు వదిలేసి.. ఆ తరువాత మామూలు నీటితో తలస్నానం చేయాలి. 

హెన్నా పెట్టుకున్న రోజు headbath తరువాత జుట్టును అలా వదిలేయండి. ఆ తరువాతి రోజు షాంపూతో తలస్నానం చేయండి. హెన్నా పెట్టుకున్న రోజు షాంపూ పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ మీకు హెన్నాలో గుడ్డు వాడడం ఇష్టం లేకపోతే.. ఒక టేబుల్ స్పూన్ పెరుగును కలుపుకోవచ్చు. 

హెన్నా జుట్టుకు సహజమైన కండీషనర్ గా పనిచేస్తుంది. స్కాల్ప్ కు కూడా చాలా మంచిది. ఇది తరచుగా చేస్తుంటే... జుట్టు ఆరోగ్యంగా, సహజమైన నలుపురంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. తెల్లజుట్టు రావడమూ ఆలస్యం అవుతుంది. 

లోదుస్తులతో మంగళసూత్రం ప్రకటన.. నెటిజన్ల ట్రోల్స్.. వెనక్కి తగ్గిన సవ్యసాచి..!

click me!