స్వాతంత్య్ర దినోత్సవం రోజు పతంగులు ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

First Published | Aug 15, 2023, 10:23 AM IST

స్వాతంత్య్ర దినోత్సవం రోజున చాలా మంది పతంగులను ఎగురవేస్తుంటారు. ఎందుకంటే ఈ పతంగులు మన స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి భావనను సూచిస్తాయి. 
 

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రాచుర్యం పొందిన, సంప్రదాయాలలో ఒకటి గాలిపటాలను ఎగురవేయడం. అవును స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతంగులను ఎగురవేయడం ఉత్తర భారత సంప్రదాయం.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున గాలిపటాలను ఎగురవేయడం కూడా చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా భారతదేశం నిరసన తెలుపుతున్నప్పుడు కొంతమంది స్వాతంత్ర్య పోరాట కార్యకర్తలు "గో బ్యాక్ సైమన్" వంటి నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన ఎంత ప్రాచుర్యం పొందిందంటే ప్రజలు వాటిపై రాసిన నినాదాలతో గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఈ  రోజున గాలి పటాలను ఎగురవేయడానికి గల కొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


స్వేచ్ఛా భావం

పతంగులను ఎగురవేయడం మన స్వంత స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని వ్యక్తీకరించడానికి ఒక మార్గం. ఎందుకంటే గాలి గాలి గాలిపటాన్ని ఆకాశంలోకి మరింత ఎత్తుకు తీసుకెళుతుంది. 
 

దేశభక్తిని చూపిస్తూ..

జెండాలు లేదా చారిత్రక కట్టడాలు వంటి దేశభక్తి చిహ్నాలతో గాలిపటాలను అలంకరించొచ్చు. మన దేశానికి మన మద్దతును చూపించడానికి, స్వాతంత్య్ర దినోత్సవాన్ని సరదాగా, సృజనాత్మకంగా జరుపుకోవడానికి ఇదొక మార్గం. మన దేశం పట్ల మన గర్వాన్ని ఇతరులకు చూపించడానికి కూడా ఇదొక గొప్ప మార్గం.
 

KITE

గతాన్ని గుర్తు చేసుకుంటూ..

బ్రిటిష్ వలస పాలనను కూడా ఈ గాలిపటాలు గుర్తు చేస్తాయి. గాలిపటాలు మన వలస మూలాలను గుర్తు చేస్తాయి. గాలిపటం ఎగురవేయడం వల్ల అప్పటి నుంచి మనం ఎంత దూరం వచ్చామో.. ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి పడిన కష్టాలను గుర్తు చేస్తుంది.

కుటుంబ సరదా కోసం..

బాణసంచా మాదిరిగా కాకుండా.. గాలిపటాలను ఎగురవేయడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. ముఖ్యంగా దీనివల్ల కుటుంబమంతా ఒకేదగ్గర ఉంటుంది. రాబోయే సంవత్సరాలు కొనసాగే గొప్ప జ్ఞాపకాలను సృష్టించడానికి ఇదొక గొప్ప మార్గం.

అందాలను చూస్తూ..

ఆకాశంలో మన పైన ఎగురుతున్న రంగురంగుల గాలిపటం అద్భుతమైన దృశ్యం. మీ గాలిపటం మేఘాలలో ఎగురుతున్నప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను కూడా చూస్తారు. 

Latest Videos

click me!