ఇక ఈలోపు బిగ్ బాస్ ఆడియన్స్ కు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడు. అందులో భాగంగా ఇంతకుముందు ప్రేరణ ఈ అవకాశం సాధించగా.. తాజా ఎపిసోడ్ లో నబిల్ టాస్క్ లు గెలిచి ఆ అవకాశం సాధించాడు. అయితే ఈ విషయంలో విష్ణు ప్రియకు రెండు సార్లు అన్యాయం జరిగింది. ఇంతకు ముందు రోజు జరిగిన టాస్క్ లో విఫ్ణు ప్రియ రోహిణి కోసం త్యాగం చేసింది.
ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లో ఉన్నావు కాబట్టి. నీకు ఈ గేమ్ ముఖ్యం అని చెప్పి.. త్యాగం చేసింది. ఇక ఇప్పుడు మాత్రం టాస్క్ లలో నబిల్, విష్ణు ప్రియ ఇద్దరు గెలిచారు. దాంతో బిగ్ బాస్ నిర్ణయం హౌస్ లో ఉన్నవారికి ఇచ్చాడు. అప్పుడు ఎక్కువ మంది నబిల్ కు ఈ అవకాశం ఇవ్వాలి అన్నారు. దాంతో విష్ణు ప్రియ ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఇక నబిల్ తనకు వచ్చిన అవకాశాన్ని యూస్ చేసుకున్నాడు.