పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ: కెజిఎఫ్ సరిపోదు, పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ విధ్వంసం, మైండ్ బ్లోయింగ్ టాక్!

First Published | Dec 5, 2024, 12:36 AM IST

అల్లు అర్జున్ కి పుష్ప 2 విజయం చాలా ప్రతిష్టాత్మకం. ఈ క్రేజీ సీక్వెల్ పై ఏర్పడిన హైప్ ని సినిమా అందుకోవాల్సి ఉంది. మరి పుష్ప 2 ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఉందా?. ట్విట్టర్ టాక్ ఏంటంటే?
 

Pushpa 2 twitter review


అల్లు అర్జున్ ఇమేజ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన మూవీ పుష్ప. ఈ సినిమాతో అల్లు అర్జున్ చేరుకున్న శిఖరాలు ఎన్నో. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ఒకరిగా అవతరించాడు. ఏకంగా నేషనల్ అవార్డు కొల్లగొట్టాడు. ఈ ఘనత అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. 2021లో విడుదలైన పుష్ప వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

Pushpa 2 twitter review

నార్త్ ఇండియాలో పాగా వేశాడు అల్లు అర్జున్. పుష్ప విడుదలై మూడేళ్లు అవుతున్నా... సీక్వెల్ పై హైప్ తగ్గలేదు. అది అంతకంతకు పెరుగుతూ పోయింది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని చెప్పిన సమయానికి పూర్తి చేయలేదు. ఆగస్టు లో విడుదల కావాల్సి ఉండగా.. డిసెంబర్ కి వాయిదా పడింది. అయినా.. ఎలాంటి నెగిటివిటీ రాలేదు. సినిమా కొరకు ఆడియన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందంటే... ఆర్ ఆర్ ఆర్ , కల్కి, సలార్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్లు దాటేసింది. ఆ చిత్రాలు పుష్ప 2 దరిదాపుల్లో కూడా లేవు. తెలుగు రాష్ట్రాలతో పాటు, హిందీ వెర్షన్ కి రికార్డు ధరలు చెల్లించి దక్కించుకున్నారు. 


Pushpa 2 twitter review

పుష్ప 2.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అల్లు అర్జున్ రూ. 300 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ 12000 లకు పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అయితే 4వ తేదీ రాత్రే షోలు పడ్డాయి. సోషల్ మీడియా వేదికగా సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

Pushpa 2 twitter review

అయితే ట్విట్టర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ , యాంటీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ ... సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. జెన్యూన్ ఒపీనియన్స్ ఆధారంగా... ట్విట్టర్ టాక్ చెప్పాల్సి ఉంది. మెజారిటీ ఆడియన్స్ ప్రకారం... సినిమా బాగుంది అంటున్నారు. 
 

Pushpa 2 twitter review

ఫస్ట్ హాఫ్ లో వచ్చే పుష్ప రాజ్ ఇంట్రో కి ప్రేక్షకులు మంచి మార్క్స్ వేస్తున్నారు. డైలాగ్స్, సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో  అల్లు అర్జున్ పాత్రకు సుకుమార్ రాసుకున్న ఎలివేషన్స్ గూస్ బంప్స్ రేపుతాయట. అల్లు అర్జున్ పాత్రపై ఎక్కువ ఫోకస్ పెట్టిన సుకుమార్, గొప్పగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడట. సాంగ్స్ కూడా బాగున్నాయట. రష్మిక-అల్లు అర్జున్ కాంబోలో వచ్చే 'పీలింగ్స్' సాంగ్ ఫీస్ట్ అంటున్నారు. 

Pushpa 2 twitter review

కథలో ట్విస్ట్స్ కూడా ఉన్నాయి అవి థ్రిల్ ఫీల్ చేస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ రిచ్ గా తెరకెక్కించారు. సినిమాకు అవి ప్రధాన బలం అట. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మాస్ మూమెంట్స్ కి కొదవలేదు. రష్మికతో అల్లు అర్జున్ రొమాంటిక్ కామెడీ కూడా చేశారట. ఆ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. 

Pushpa 2 twitter review

సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఫైట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉందట. అల్లు అర్జున్ గెటప్, స్వాగ్ ప్రేక్షకులను వెంటాడేలా ఉందట. కిస్సిక్ సాంగ్, క్లైమాక్స్ బాగున్నాయట. ఇక పుష్ప 2 మూవీలో మైనస్ ల ప్రస్తావనకు వస్తే.. కథలో బలం లేదు. లెంగ్త్ వలన అక్కడక్కడా మూవీ నెమ్మదించిన భావన కలుగుతుంది. పార్ట్ 2లో అరిపిస్తాడు అనుకున్న ఫహద్ పాత్ర కొంచెం డల్ గా ఉందని అంటున్నారు. మొత్తంగా పుష్ప 2 కి పాజిటివ్ టాక్ దక్కింది. ఇక మూవీ ఫలితం ఏమిటో పూర్తి రివ్యూలో చూద్దాం.. 
 

Latest Videos

click me!