సడెన్ గా బరువు పెరుగుతున్నారా? డౌటే లేదు మీకు ఈ సమస్యలున్నట్టే..!

First Published Jan 31, 2023, 10:51 AM IST

బరువు పెరగడం చాలా సహజ విషయం. వయస్సు, కండర ద్రవ్యరాశిని కోల్పోవడం, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం, జీవక్రియ నెమ్మదించడం, రుతుచక్రం వంటి వాటివల్ల కూడా కొంతబరువు పెరుగుతారు. అయితే వీటివల్ల నిదానంగానే బరువు పెరుగుతారు కానీ అంత సడెన్ గా పెరిగే ఛాన్స్ ఉండదంటున్నారు నిపుణులు. 

మనలో చాలా మంది కొన్ని సమయాల్లో వెయిట్ పెరగడం, కొన్ని సమయాల్లో వెయిట్ తగ్గడం వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా బరువు  తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా జరుగుతుంది. నిజానికి కాలక్రమేణా బరువు పెరగడం సర్వ సాధారణ విషయం. అయినప్పటికీ.. ఒక వ్యక్తి స్పష్టమైన కారణం లేకుండా చాలా తక్కువ సమయంలో బరువు పెరగడం అంత మంచి విషయం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది అంతర్లీన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చు. కొన్ని అంతర్లీన సమస్యల వల్లే మీ శరీరం వేగంగా వెయిట్ పెరుగుతుందట. ఇంతకీ అవి ఏయే సమస్యలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రలేమి 

నిజం చెప్పాలంటే రాత్రిళ్లు 6 గంటల కంటే తక్కువ సమయం పడుకునే వారి శరీరంలోనే కొవ్వు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా..? రాత్రిపూట 8 గంటలు కంటినిండా నిద్రపోతే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరం కార్టిసాల్, ఇన్సులిన్ హార్మోన్లను ఎక్కువగా తయారు చేస్తుంది. ఇది పౌండ్లను పెంచుతుంది. దీంతో మీ ఆకలి కోరికలు ఎక్కువగా పెరిగిపోతాయి. ఇంకేముంది తినాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా తింటారు. ముఖ్యంగా కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే  ఆహారాలనే తినడానికి ఇష్టపడతారు. 
 

weight gain

రుతుస్రావం

అప్పుడప్పుడు బరువు పెరగడం రుతుచక్రం వల్ల జరుగుతుంది. పీరియడ్స్ సమయంలో ఉబ్బసంగా అనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను మార్చడం వల్ల బరువు పెరగొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి టైంలో కొన్ని పౌండ్ల బరువు మాత్రమే పెరుగుతారు. అయితే రుతుక్రమం ముగిసిన తర్వాత పెరిగిన బరువును తగ్గుతారు. రుతుస్రావం ప్రారంభమైన మరుసటి నెలలో, అలాగే కొన్నిసార్లు అండోత్సర్గము సమయంలో ఇలా  బరువు పెరుగుతారు. కానీ ఇది ముగియగానే మళ్లీ మీరు మామూలుగా మారిపోతారు. 

Image: Getty Images

హైపోథైరాయిడిజం
 
బరువు సంగతి పక్కన పెడితే.. అలసట, పొడి చర్మం లేదా సన్నని జుట్టు వంటి ఇతర శరీర మార్పులను మీరు గమనించారా? ఇవన్నీ హైపోథైరాయిడిజం సంకేతాలు. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేని పరిస్థితినే హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ అనేక శరీర విధులను నియంత్రించే మాస్టర్ గ్రంథి. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు దీని లక్షణాలు మీ శరీరమంతా కనిపిస్తాయి. దీనిలో బరువు పెరగడం కూడా ఒకటి. 
 

ఒత్తిడి

ఈ రోజుల్లో ఒత్తిడిలేని లైఫ్ ను గడిపేవారు ఉండరేమో. పని ఒత్తిడి, సంపాదన, ఆర్థిక సమస్యలు వంటి కారణాల వల్ల నేడు చాలా మంది ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్డిసాల్ నే "ఒత్తిడి హార్మోన్" అంటారు. ఈ హార్మోన్ ఆకలి పెరగడానికి కారణమవుతుంది. వాస్తవానికి ఒత్తిడి సమయాల్లో కూడా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలనే తినాలనుకుంటారు. ఈ రెండింటి కలయిక వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. 
 

డయాబెటిస్

డయాబెటీస్ రకాన్ని బట్టి ఆహారం, వ్యాయామం, ఇన్సులిన్, మందులతో డయాబెటిస్ ను నియంత్రించొచ్చు. ఇన్సులిన్ మన శరీరం శక్తిని ఉపయోగించడానికి సహాయపడుతుంది. కానీ ఇది మీ శరీరానికి శక్తిని నిల్వ చేయడం సులభం చేస్తుంది. ఇది తరచుగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాలను తినే ప్రమాదాల్ని కూడా పెంచుతుంది. మధుమేహులు శరీర బరువు అదుపులో ఉంచడానికి, డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి వైద్యుల సహాయం తీసుకోండి. 

click me!