కెచప్ అంటే లొట్టలేస్తారా?? అయితే కష్టమే.. బరువు పెరగడాన్ని ఆపలేరిక...!

First Published | Sep 8, 2021, 2:18 PM IST

టమాటా కెచప్ లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకలా? దీనికి కారణాలేంటి? అనే విషయాల్ని కూడా వారు వివరిస్తున్నారు. 

కెచప్ అంటే మీకు చాలా ఇష్టమా? బ్రెడ్, నూడుల్స్, ఉప్మా.. ఫాస్ట్ ఫుడ్స్.. ఇలా ఏది తినాలన్నా కెచప్ ను వదలడంలేదా? అయితే ఇది డేంజర్ కావచ్చు. ఊబకాయం రావడానికి దోహదపడొచ్చు. నడుము ప్రాంతంలో కొవ్వును పెంచడానికి దోహదపడొచ్చు. అందుకే కెచప్ లవర్స్ దీన్ని ఎక్కువగా తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

టమాటా కెచప్ లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకలా? దీనికి కారణాలేంటి? అనే విషయాల్ని కూడా వారు వివరిస్తున్నారు. 

Latest Videos


టొమాటో కెచప్ అత్యంత విస్తృతంగా ఇష్టపడే వాటిల్లో ఒకటి. ఈ కెచప్ ని ఇష్టపడానికి దాని ప్రత్యేకత ఏమిటంటే థిక్ గా ఉండడం, క్రీము ఆకృతి,  తీపి రుచి. అయితే ఈ కెచప్‌లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది టమోటాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో, దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, మయోన్నైస్ వంటి వాటితో పోలిస్తే టమోటా కెచప్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. అయితే.. ఇన్ని సుగుణాలున్నా..  ఇది మీ ఆరోగ్యానికి మంచిదా? కాదా? తెలుసుకుందాం ...

టమాటా కెచప్ ని తీపి విషంగా మార్చేది ఏమిటి? అంటే.. మనలో చాలామంది కెచప్ రుచికి ఫిదా అయిపోతారు. అందుకే దానిని జంక్ ఫుడ్‌తో కలిపి తినడానికి ఇష్టపడతారు. అయితే కెచప్ లో సహజంగా తక్కువ కేలరీలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ దీనివల్ల మంచి కంటే చెడు  ఎక్కువగా ఉంటుంది. 

ఎందుకంటే  టమోటా కెచప్ అద్భుతమైన  రుచికి కారణం చక్కెర, ప్రిజర్వేటివ్స్, ఫ్రక్టోజ్ రిచ్ కార్న్ సిరప్, ఉప్పు,  సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల వస్తుంది. దీనివల్లే సుమారు 17 గ్రాముల టమోటా కెచప్‌లో 19 కేలరీలు ఉంటాయి.ఇక వీటిని వేయించిన, నూనె పదార్థాలతో కలిపి తినడం వల్ల కేలరీల సంఖ్య మరింత పెరుగుతుంది.

ఒక టేబుల్ స్పూన్ టమోటా కెచప్ తినడం వల్ల అంతగా హాని ఉండదు. కానీ దాన్నే మీరు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ కు కలిపి తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది, ఇది చివరికి అధిక రక్తపోటు, అనేక ఇతర ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది.

అంతే కాకుండా, కెచప్ లో ఫ్రక్టోజ్ అధికంగా ఉండే మొక్కజొన్న సిరప్‌లు ఉండటం వల్ల ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరైడ్‌లు ఏర్పడవచ్చు, ఇది దీర్ఘకాలంలో కొవ్వు కాలేయ వ్యాధి, మధుమేహం, గుండె సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది.

మరెలా..? ఈ కెచప్ ప్రేమనుంచి బయటపడేదెలా? అంటే.. ఇంట్లోనే ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఏవీ లేకుండా తయారు చేసుకోవడం. ఆరోగ్యం కంటే రుచి ముఖ్యం కాదని గ్రహించడం. వీలైనంత వరకు జంక్, స్పైసీ ఫుడ్స కు దూరంగా ఉండడం. 

click me!