Independence Day 2022: ఈ కోట్స్ తో మీ బంధువులకు, ఫ్రెండ్స్ కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి..

First Published | Aug 9, 2022, 2:42 PM IST

Independence Day 2022: ఈ  ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ కు, బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి. 

స్వాతంత్య్ర పోరాటంలో మీరు ప్రాణాలు కోల్పోవచ్చు. 
కానీ మీరందించిన ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల్లో జీవిస్తూనే ఉన్నారు. 
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వేచ్చా భారతావని కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోదులను స్మరిస్తూ.. 
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
 


బ్రిటీస్ వారి నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు అలుపెరగని పోరాటం చేసిన అమర వీరులకు పాదాభివందనం- స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

సాంస్కృతిక చరిత్రలో సుసంపన్నమైన, 
భిన్నత్వంలో ఐక్యమై.. 
నా దేశమైన భారతదేశానికి ఒక సెల్యూట్-హ్యాపీ ఇండిపెండెన్స్ డే..  

ఎందరో అమర వీరులు జన్మించిన ఈ భరత నేలపై పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. 
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 

మన దేశాన్ని చూసి గర్వపడదాం.. 
భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, బలంగా మార్చడానికి మనమందరం సమిష్టిగా కృషి చేద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
 

మన పూర్వీకుల కష్టఫలితమే మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ స్వాతంత్య్ర దినోత్సవం..
ఇప్పుడు రాబోయే తరాలకు మెరుగైన దేశాన్ని సృష్టించడానికి మనం కష్టపడి పనిచేద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

మనకు ఎన్నో హక్కులున్నాయి. కానీ ఒక హక్కు కోసం ఎంతో మంది ధైర్యవంతులు పోరాడారు.  వారి త్యాగాలను స్మరించుకుందాం..

నా దేశం పట్ల నా ప్రేమ అపరిమితమైనది. 
నా ప్రజల పట్ల నా ప్రేమ అంతులేనిది. 
నా దేశం కోసం నేను కోరుకునేది ఆనందం మాత్రమే.
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 

ఒక వ్యక్తి ఆక ఆలోచన కోసం ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ఆ ఆలోచన మాత్రం అతని మరణానంతరం.. వెయ్యి మంది జీవితాలలో జీవిస్తుంది- నేతాజీ సుభాష్ చంద్రబోస్

మీ రక్తాన్ని నాకు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను - నేతాజీ సుభాష్ చంద్రబోస్

మనుషులను చంపడం చాలా సులువేమో.. కానీ ఆ మనుషుల ఆలోచనలను మాత్రం చంపలేరు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోవచ్చు. ఆలోచనలు మాత్రం ఒకతరం నుంచి మరో తరానికి చేరుకుంటూనే ఉంటాయి. - భగత్ సింగ్..
 

Latest Videos

click me!